మనీ: ఈ మామిడికి మంచి గిరాకి.. ఏకంగా టన్ను రూ.2లక్షలు..!!

Divya
ఎండాకాలం వచ్చిందంటే చాలు చాలా మంది ఎక్కువగా మామిడికాయలను తినడానికి మక్కువ చూపుతూ ఉంటారు.. ఆంధ్రప్రదేశ్లోని మామిడి పంటల దిగుబడికి మంచి డిమాండ్ ఉన్నది.. మామిడిపండ్లలో చిత్తూరు జిల్లా మొదటి స్థానం ఉందని చెప్పవచ్చు.. ముఖ్యంగా టేబుల్ రకం మామిడికాయల సాగులో చిత్తూరుకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది.. ప్రతి ఏడాది కూడా చిత్తూరు నుంచి మామిడికాయలు ఇతర విదేశాలకు కూడా ఎగుమతి చేస్తూ ఉంటారు.. అందుకే ఇతర దేశస్తులు కూడా ఇండియన్ మామిడి పండ్లను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు.. సరైన వర్షాలు పడడం వల్ల ప్రతి ఏటా కూడా దిగుబడి బాగా పెరుగుతూ ఉండేది.

అయితే ఈసారి మాత్రం వర్షాలు ప్రతికూల వాతావరణం పరిస్థితుల కారణంగా టేబుల్ రకం మామిడికాయలు ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదట.దీంతో కనీసం 10% పంటపై కూడా దిగుబడి రాకపోవడంతో ఉన్న మామిడి పండ్లకు మార్కెట్లో ఫుల్ డిమాండ్ పెరిగిపోయింది.. కనివిని ఎరుగని రీతిలో మార్కెట్ లో మామిడికాయలు ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.. మామిడికాయలను కింగ్ గా పేరు పొందిన భీనిషా మామిడి పండ్లు టన్ను ప్రస్తుతం రూ .2లక్షల రూపాయల వరకు పలుకుతోందట.

సామాన్యుల సైతం ఇలాంటి మామిడి పండ్లను కొనలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు.. కానీ ఈ పంట ద్వారా సాగు చేసిన రైతులకు మాత్రం మంచి సిరులు కురిపిస్తున్నాయి బినిషా మామిడి పండ్లు.. ఎవరికైతే.. తక్కువ నీరు ఉండి ఎక్కువ భూమి ఉంటుందో వారికి ఈ పంట బెస్ట్ పంట అని కూడా చెప్పవచ్చు.. ప్రతి ఏడాది కూడా మామిడి పండ్ల సీజన్ వస్తూనే ఉంటుంది.వీటి ధర కూడా బాగానే ఉంటుంది. కేవలం ఒకసారి చెట్లు నాటి వదిలేసి ప్రతి ఏడాది సీజన్ సమయంలో వీటిని పురుగు మందులను పిచికారి చేసి పూత నిలబడేలా చేస్తే చాలు అధిక రాబడిని అందుకోవచ్చు.. దాదాపుగా పదేళ్లపాటు ఈ చెట్లు అధిక దిగుబడిని ఇస్తాయని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: