మనీ: కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా బోలెడు బెనిఫిట్స్.. ఎలా అప్లై చేయాలి..!!
బ్యాంకులు జారీ చేసినటువంటి కిసాన్ క్రెడిట్ కార్డులు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.. ముఖ్యంగా పావులా వడ్డీకి..4% తో రూ.3 లక్షల వరకు సైతం అప్పు లభిస్తుందట. ఇందులో..1.60 లక్షల వరకు మనం తీసుకునే లోన్ కు బ్యాంకు ఎలాంటి గ్యారెంటీ అడగదట. వ్యవసాయ ఉత్పత్తులు మార్కెటింగ్ కోసమే ఈ రుణాన్ని సైతం రైతులు పొందవచ్చు. అప్పుగా తీసుకున్న డబ్బులతో మనం పశువులు ఇతరత్రా వాటిని కొనుక్కోవచ్చు.. వ్యవసాయ పరికరాలను సమకూర్చుకోవడానికి కూడా ఈ డబ్బును సైతం మనం ఉపయోగించుకోవచ్చు. అయితే దీనికి ఎలాంటి షరతులు ఉండవు..
అప్పుని తిరిగి తీర్చే విషయంలో కూడా రైతులకు అనుకూలంగానే ఆప్షన్ని ఎంచుకోవచ్చు..కిసాన్ క్రెడిట్ కార్డుతో అర్హులైన రైతులకు స్మార్ట్ కార్డ్ డెబిట్ కార్డ్ సేవింగ్ అకౌంట్ నుంచి కూడా పలు రకాల ఆప్షన్స్ కూడా లభిస్తాయట. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే ఈ కిసాన్ కార్డ్ .. వల్ల హోల్డర్ యొక్క శాశ్వత వైకల్యం లేదా మరణానికి గురైతే వారి యొక్క కుటుంబానికి 50వేల వరకు బీమా కూడా లభిస్తుందట.. ఒకవేళ ఇతరత్రా వైద్య విషయంలో ఖర్చుల నిమిత్త 25 వేల రూపాయలు లభిస్తుంది.
ఈ కార్డు కోసం ఎలా అప్లై చేయాలి అంటే..
1)పొలం సాగు చేస్తున్న యజమాని అయ్యుండాలి..
2).పశు పోషణ వ్యవసాయానికి సంబంధించిన కార్యక్రమాలలో ఉండాలి.
3). ఫిషరీస్ మరియు పశుపోషన కింద ఈ పథకానికి అర్హులు.. గొర్రెలు కుందేలు పందులు పక్షులు కోళ్ల పెంపకం రైతులు కూడా అర్హులే..
దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇతరత్న డాక్యుమెంట్లను దరఖాస్తుతో నింపాలి.. అలాగే భూమి పత్రాలు బ్యాంకు సెక్యూరిటీ కోసం ఇతరత్రా పత్రాలను కూడా సమర్పించాల్సి ఉంటుంది.. ఈ కిసాన్ క్రెడిట్ కార్డు కోసం ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో కూడా అప్లై చేసుకుని సదుపాయం కలదు. పూర్తి సమాచారం కోసం బ్యాంక్ బ్రాంచ్ ఆఫీస్ కి వెళ్ళాలి..