మనీ: రైతులకు శుభవార్త.. బియ్యం ధరకు రెక్కలు..!!
గత కొన్ని నెలలుగా దేశంలో బాస్మతి రకం బియ్యం ధరలు వేగంగా పెరుగుతూ ఉండడంతో ప్రజలు ప్రభుత్వం కూడా ఆందోళన చెందుతోంది నిన్నటి రోజున ఆహార శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా బియ్యపు ధరలు సహజంగానే ఉండేలా చర్యలు తీసుకోవాలంటూ కోరడం జరిగింది. దేశంలో నాణ్యమైన బియ్యం నిల్వలు ఉన్నాయని.. కానీ మార్కెట్లో మాత్రం కిలో బియ్యం ధర 50 రూపాయల వరకు విక్రయిస్తున్నారని.. ఇంతకంటే ఎక్కువగా అమ్మితే వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నారు. అంతేకాకుండా బాస్మతి బియ్యం ఎగుమతి పైన ప్రభుత్వం నిషేధించడం కూడా జరిగింది.
దేశీయ మార్కెట్లలో బియ్యం కొరత లేకుండా చూడాలని ఆయా ప్రభుత్వాలు సైతం ప్రయత్నాలు చేస్తున్నాయి అయినప్పటికీ మార్కెట్లో బియ్యం ధరలు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి.దీంతో అక్టోబర్ నెల నుంచి ఇప్పటివరకు ఎగుమతి చేస్తున్న బియ్యం ధర పైన టన్నుకు 950 డాలర్లు పెరిగిందట. ఖరీఫ్ లో మంచి పంట పండడంతో పాటు..FCI వద్ద తగినంత స్టాక్ ఉన్నప్పటికీ బియ్యం ఎగుపతి పైన నిషేధించడం ఉన్నప్పటికీ బాస్మతి బియ్యం ధరలు పెరుగుతూనే ఉన్నాయని తెలుపుతున్నారు. దాదాపుగా రెండేళ్లలోనే 12 శాతం వరకు బియ్యం ధరలు పెరిగాయని తెలియజేస్తున్నారు. ప్రస్తుతం పాత బియ్యం అయితే.. 3200 వరకు ఉండగా కొత్త బియ్యం అయితే 2400 ఉన్నట్లు తెలుస్తోంది..