మనీ: ఈ బిజినెస్ తో 3గంటలు కష్టపడితే చాలు లక్షలలో ఆదాయం..!!
సాండ్విచ్ అంటే చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు. శాండ్విచ్ బిజినెస్ ని మొదలుపెట్టి అతి తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బులను సైతం సంపాదించుకునే బెస్ట్ ఐడియా బిజినెస్ గా చెప్పవచ్చు. దీనికోసం మనం ప్రత్యేకంగా ఒక రూముని సైతం అద్దెకు తీసుకోవాలి అలాగే కాస్త ఎక్కువగా అనుకునేవారు బేకరీ కూడా ఇందులోనే అమర్చుకోవచ్చు. దీనివల్ల లాభాలు సైతం పెరుగుతూ ఉంటాయి. అయితే ఈ సాండ్విజు తయారు చేయడానికి గ్రిల్ సాండ్విచ్ మిషన్ మాత్రం కచ్చితంగా అవసరం పడుతుందట. దీని ధర పదివేల రూపాయల నుంచి ఉన్నట్లు తెలుస్తోంది.
అలాగే మిషన్ తో పాటు బ్రెడ్ మసాలా ఇతరత్రా వాటిని తీసుకోవడం అవసరము.. ఎవరైనా సాండ్విచ్ బిజినెస్ చేయాలి అంటే కచ్చితంగా వీటికి శిక్షణ తీసుకోవడం మంచిది. ఎందుకంటే బేకరీ ఉత్పత్తుల తయారు చేయాలి అంటే గుర్తింపు పొందిన ప్రభుత్వ సంస్థల నుంచి శిక్షణ కేంద్రంలో ట్రైనింగ్ తీసుకున్నట్లుగా సర్టిఫికెట్ ని మెయింటైన్ చేయాలి.. ఈ బిజినెస్ ని సైతం మొదలుపెట్టాలి అంటే 50 నుంచి 80 వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది.. మీ సాండ్విచ్ మంచి టెస్ట్ అనిపిస్తే కస్టమర్లు సైతం వెతుక్కుంటూ మరి మీ దగ్గరికి వస్తారు. దీంతో బిజినెస్ కూడా బాగానే జరుగుతుంది. అలా నెలకి కొన్ని లక్షల రూపాయలను సైతం ఆదాయంగా చేసుకోవచ్చు. మరి ఎవరైనా బిజినెస్ పెట్టాలనుకునే వారికి ఇది చక్కటి అవకాశం.