మనీ: పెన్షనర్లకు 3000 పెంచుతూ నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం..!!

Divya
ఆంధ్రప్రదేశ్లోని సీఎం జగన్మోహన్ రెడ్డి తాజాగా తాడేపల్లిలో క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రిత్వ వర్గ సమావేశం జరగబోతున్నది. అన్ని శాఖలకు సంబంధించిన మంత్రుల సైతం ఇక్కడ పాల్గొనబోతున్నారు. రాష్ట్రంలో అమలు కావలసిన పలు రకాల సంక్షేమ పథకాలకు సైతం ఆమోదంతో పాటు నాలుగు కీలకమైన అంశాల పైన చర్చించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం మొదటిది జనవరి నుంచి వృద్ధాప్య పెన్షన్స్ ను 3000 పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరుగుతుందట. అలాగే ఇటీవల సంభవించిన మీచౌంగ్ తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు సైతం నష్టపరిహారం అందించే విధంగా సేకరిస్తున్నారు.


అలాగే ఆరోగ్యశ్రీ వైద్య చికిత్స పరిమితి 25 లక్షలకు సైతం పెంచుతూ పలు రకాల ఉత్తర్వులను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.వీటన్నిటితో పాటు పలు సంస్థలకు ప్రభుత్వ భూమిని కేటాయించిన విషయంలో కూడా ఆమోదాన్ని తెలియజేయబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలియజేస్తోంది. వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తే 3000 వేల రూపాయల పెన్షన్ హామీ పథకాన్ని  అమలు చేస్తామని చెప్పి అమలు చేశామని తెలియజేస్తున్నారు. ప్రతిఏటా 250 రూపాయలను పెంచుకుంటూ పోతామని తెలియజేశారు.

ఇందులో భాగంగా వచ్చే ఏడాది జనవరి 1 నాటికి ఒంటరి మహిళ వివిధ వృత్తులలో పింఛన్ పొందుతున్న వారికి 3000 రూపాయల వరకు పెంచబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రైతుల వెంట నష్టం పైన కూడా అంచనా వేసి అందుకు తగ్గట్టుగా ఆర్థిక సహాయాన్ని సైతం అందించే విధంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది ఏపీ ప్రభుత్వం. అంతేకాకుండా గ్రామాలలో కులాయిల ఏర్పాట్లకు కాంట్రాక్టులు డ్వాక్రా మహిళలకు సంఘాలకు ఇచ్చే విషయం పైన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ క్యాబినెట్లో పలు రకాల నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన విషయాలను సైతం సాయంత్రం లోపు క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది. ఈసారి ఎన్నికలలో తమ హవా చూపించాలని చూస్తోంది వైసీపీ ప్రభుత్వం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: