మనీ: ఈ బిస్కెట్ల వ్యాపారంతో నెలకు లక్ష ఆదాయం..!!

Divya
చాలామంది యువత ఈ మధ్యకాలంలో ఉద్యోగం కంటే ఎక్కువగా వ్యాపారం వైపే అడుగులు వేస్తూ ఉన్నారు. తాము సంపాదించిన వాటితో కుటుంబాన్ని బాగా చూసుకోవడమే కాకుండా నలుగురికి ఉపాధన కల్పించే విధంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా పలు రకాల వ్యాపార ఐడియాలతో సైతం ముందుకు వెళుతున్నారు. ప్రభుత్వాల సహకారంతో పలు రకాల రుణాలను పొందుతూ వ్యాపారాలను సైతం ప్రారంభిస్తూ ఉన్నారు. అలాంటి బెస్ట్ బిజినెస్ ఐడియాలలో నష్టం తక్కువగా ఉండే వాటిలలో రస్క్ బిస్కెట్లు తయారీ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

చాలామంది ఫుడ్ విషయంలో ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తూ ఉంటారు.ఉదయం లేచిన మొదలు సాయంత్రం వరకు ఎక్కువగా టిఫెన్స్, స్నాక్స్ వంటివి తింటూ ఉంటారు. అలాంటి వాటిలలో ఎక్కువగా రస్కులను తింటూ ఉండడం జరుగుతుంది. అందుకే పలు రకాల బ్రాండెడ్ సంస్థలు కూడా రస్కులను తయారు చేస్తూ భారీగానే లాభాలను పొందుతూ ఉన్నారు. ఎవరైనా తక్కువ పెట్టుబడితో ఈ రస్కు బిస్కెట్ల తయారీ యూనిట్ని ప్రారంభించుకోవచ్చట. మరి వీటిని ప్రారంభించాలంటే ఎంత పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది అనే విషయాన్ని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఈ రస్క్ బిస్కెట్లు తయారీ కంపెనీ పెట్టాలి అంటే 800  చదరపు అడుగుల స్థలం ఉండాలి.. లేకపోతే ఏదైనా సొంత ఇల్లు అయినా పర్వాలేదు. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి అయ్యే ఖర్చు దాదాపుగా 40 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందట. ఇది ఆ యూనిటీ అవసరమయ్యేటువంటి స్థలాన్ని కలుపుకొని ఆధారంగా ఇంత ఖర్చవుతుందని తెలుపుతున్నారు. ఒకవేళ స్థలం ఉంటే 4 లక్షల రూపాయలతో మిషనరీ.. 10 లక్షల రూపాయలతో ఫర్నిచర్.. మరో రెండు మూడు లక్షలతో వర్కింగ్ క్యాపిటల్ వంటివి అవసరపడతాయట.

ఈ రస్కు బిస్కెట్ల బిజినెస్ ని ఒకసారి మొదలు పెడితే చాలు లాభాలు కూడా అదే స్థాయిలో వస్తాయట. అయితే ఈ వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ముద్ర యోజన కింద 10 లక్షల రూపాయల వరకు ఇస్తారట. దీంతో ప్రతి ఏడాది లక్ష రూపాయలకు పైగా ఆదాయాన్ని సైతం తీసుకోవచ్చని మార్కెట్ వర్గాలు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: