Money: ఈ పథకాలు మహిళల కోసమే ప్రత్యేకం.. ఎలా అంటే..?
మహిళల యొక్క ఆర్థిక సాధికారతే లక్ష్యంగా వచ్చిన ఈ పథకంలో మహిళలు కూడా ఎక్కువగా ఆకర్షితులవుతూ ఉండడం గమనార్హం. ఇందులో పెట్టుబడి పెట్టాలనుకున్న వారికి అధిక రాబడి కూడా వస్తుంది. ఈ పథకం తో పాటు సుకన్య సమృద్ధి యోజన పథకం కూడా మహిళలకు మంచి ఆర్థిక భద్రతను కలిగిస్తోందని చెప్పవచ్చు.ఇకపోతే మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ పథకంలో ఆడవారికి ఏవిధంగా ఉపయోగం ఉంది అనే విషయానికి వస్తే.. ఇందులో కనిష్టంగా 1000 రూపాయల నుంచి గరిష్టంగా రూ.2లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. అలాగే ఈ పథకం యొక్క పెట్టుబడి కాలం రెండు సంవత్సరాలు మాత్రమే.. గరిష్టంగా 7.5% వడ్డీ లభిస్తోంది.ఇక మొదటి సంవత్సరం తర్వాత ఖాతాదారులు.. మీ మొత్తంలో 40 శాతం వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. దగ్గర్లోని పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకులో ఈ పథకం గురించి తెలుసుకొని చేరవచ్చు.
ఇక మరొకటి సుకన్య సమృద్ధి యోజన పథకంలో 10 సంవత్సరాలలోపు ఆడపిల్లలు చేరవచ్చు. డిపాజిట్ చేసిన మొత్తం పై 8% వడ్డీ లభిస్తుంది. కనిష్టంగా రూ.250 నుంచి గరిష్టంగా రూ .1.5లక్షల వరకు ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. 18 ఏళ్లు వచ్చాక 50 శాతం డబ్బు ఉపసంహరించుకుంటే.. 21 సంవత్సరాలు వచ్చిన తర్వాత పూర్తి డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు. అంతే కాదు ఇందులో సెక్షన్ 80 సి కింద రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది.