Money: పెట్టుబడి పై అధిక వడ్డీ కావాలంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేయాల్సిందే..!
అటువంటి పరిస్థితుల్లో ఈ పథకం కింద 6.5 శాతానికి బదులు 6.7% వడ్డీ లభిస్తోంది. ఫిక్స్డ్ డిపాజిట్ మాదిరి రికరింగ్ డిపాజిట్ కూడా జీతాలు తీసుకునే వారికి అలాగే సీనియర్ సిటిజెన్లకి ఒక మంచి డిపాజిట్ స్కీమ్ అని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ఈ పోస్ట్ ఆఫీస్ కంటే కూడా ఎస్బిఐ అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంకులో రికరింగ్ డిపాజిట్ పథకం పై ఎక్కువ పెట్టబడిన అందిస్తున్నాయి. ఎస్బిఐ ఒక సంవత్సరం నుండి పది సంవత్సరాల లో మెచ్యూర్ అయ్యే రికరింగ్ డిపాజిట్ పథకాలపై 5.75% నుండి 7% వడ్డీని అందిస్తోంది. ఈ రేటు ఫిబ్రవరి 15 2023 నుండి అమలులోకి వచ్చింది.
అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంకు కూడా 6 నెలల నుండి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే రికరింగ్ డిపాజిట్ పథకాలపై 4.50% - 7% వడ్డీని ఆఫర్ చేస్తోంది. అలాగే ఎస్బిఐ ఐదేళ్లపాటు రికరింగ్ డిపాజిట్లు పై 6.5% వడ్డీని అందిస్తూ ఉండగా.. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అదే పదవీకాలం పై 7శాతం వడ్డీని అందిస్తోంది. కాబట్టి మీరు పోస్ట్ ఆఫీస్ లలో కంటే ఇక్కడ అధిక వడ్డీని పొందవచ్చు. అలాగే సెక్షన్ 80c కింద రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు కూడా ఉంటుంది.