Money: మహిళలకు కేంద్రం శుభవార్త.. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే..!
మహిళా లేదా మైనర్ బాలిక పేరు మీద ఈ పథకం కింద ఖాతా తెరిచే అవకాశం ఉండగా.. గరిష్టంగా 2 లక్షల రూపాయల వరకు ఈ పథకంలో డబ్బులను డిపాజిట్ చేసే అవకాశం ఉంటుంది. ఇకపోతే రెండు సంవత్సరాల కాలం వ్యవధితో ఈ స్కీమ్ లో డబ్బులను డిపాజిట్ చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ పథకం పైన 7.5% వడ్డీ కూడా లభిస్తుంది.పన్ను మినహాయింపు ప్రయోజనాల తో పాటు అధిక వడ్డీని కూడా పొందవచ్చు. ఇక్కడ బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ ల కంటే కొన్ని అదనపు ప్రయోజనాలను ఈ స్కీం ద్వారా పొందే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఇందులో మీరు కనీసం వెయ్యి రూపాయల నుంచి ఇన్వెస్ట్ చేయాలి.
రెండు సంవత్సరాల పాటు ఈ పథకం లో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే.. రూ.32,000 వడ్డీ లభిస్తోంది. ఈ పథకం గురించి ఏవైనా సందేహాలు ఉంటే దగ్గర్లో ఉన్న బ్యాంకు బ్రాంచ్ లేదా పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి ఈ పథకం గురించి తెలుసుకోవచ్చు. ముఖ్యంగా బ్యాంకు స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయాలని భావించే మహిళలకు ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనడంలో సందేహం లేదు. ఇలాంటి పథకాల వల్ల మహిళలకు మంచి ఆదాయం కూడా లభిస్తుంది.