Money: నేడే వైయస్సార్ కాపు నేస్తం డబ్బులు జమ..!
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం జమ చేయనున్నారు. వైఎస్ఆర్ కాపు నేస్తం కింద 45 నుండి 60 సంవత్సరాల లోపు వయసు ఉన్న ఒంటరి మహిళ, కాపు, బలిజ కులాలకు చెందిన పేద అక్క చెల్లెమ్మలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్న నేపథ్యంలో రూ.15000 చొప్పున మొత్తం ఐదు సంవత్సరాల లో రూ.75,000 ను వారి ఖాతాల్లోకి జమ చేయనున్నారు. ఇకపోతే ఇప్పటికే మూడు విడుదల వారీగా డబ్బులను జమ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నాలుగో విడతను కూడా ఈరోజు జమ చేయనుంది.
ఇప్పటివరకు నేడు విడుదల చేయబోయే ఆర్థిక సహాయంతో కలిపి మొత్తం రూ.2,029 కోట్ల రూపాయలను నాలుగేళ్లలో అందించింది రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాదు గత ప్రభుత్వం చేయని ఎన్నో పనులను నేడు తమ ప్రభుత్వం చేసి చూపిస్తోందని కూడా జగన్ ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వ హయాంలో ఒంటరి మహిళ, కాపు, బలిజ కులాలకు వివిధ రూపాలలో ఐదు సంవత్సరాలలో సగటున ఏడాదికి కనీసం రూ.400 కోట్ల కూడా ఇవ్వని దుస్థితి నెలకొనిందని.. అంతేకాదు కాపు రిజర్వేషన్ల విషయంలో కూడా మోసం చేయడమే కాకుండా సంవత్సరానికి రూ.1000 కోట్లు చొప్పున 5 సంవత్సరాలలో రూ .5000కోట్లు కేటాయిస్తామని చెప్పి పూర్తిగా మోసం చేశారని జగన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇకపోతే రాజకీయంగా కాపులను బలోపేతం చేయడం కోసం అలాగే పేద అక్కచెల్లెమ్మలను ఆర్థికంగా ఆదుకోవడం కోసం జగన్ ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని నిరూపిస్తోంది.