మనీ: రేపే జగనన్న విద్యాదివేన డబ్బులు జమ..!!

Divya
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం పలు పథకాలతో పాటు పలు రకాల కార్యక్రమాలను చేపడుతూ ప్రజలలో మమేకమవుతూ మంచి పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. ముఖ్యంగా తన చేపట్టిన పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఇప్పటివరకు 90% పథకాలు అమలు చేశామని తెలియజేస్తూ ఉన్నారు. అర్హత కలిగి ఉండి ఏ ఒక్కరు కూడా అనర్హులుగా ఉండకూడదని అలాంటివారికి మళ్ళీ అవకాశాన్ని కల్పిస్తూ వారి ఖాతాలో డబ్బు జమ చేస్తూ ఉన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి..



ఇప్పుడు తాజాగా మళ్లీ ఈ ఏడాది జగనన్న విద్యా దీవెన డబ్బులు ఈనెల 28వ తేదీన అంటే రేపటి రోజున విద్యార్థుల ఖాతాలో జమ చేయబోతున్నట్లు తెలియజేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రేపటి రోజున చిత్తూరు జిల్లాలోని నగరి నియోజవర్గంలో పర్యటిస్తున్న సందర్భంగా .. రేపటి రోజున ఉదయం 8:30 ప్రాంతంలో తాడేపల్లిలో బయలుదేరిన జగన్ ఆ తర్వాత నగరికి చేరుకోబోతున్నారు.అక్కడే విద్యార్థుల విద్యావన పథకానికి సంబంధించిన నిధులను కూడా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి బటన్ కూడా నక్క బోతున్నట్లు సమాచారం.


అనంతరం ఈ సభలో జగన్ ప్రసంగించబోతున్నట్లు తెలుస్తోంది ఈ పథకం కింద ఐటిఐ పాలిటెక్నికల్ ఇంజనీరింగ్ మెడిసిన్ డిగ్రీ తదితర కోర్సులు చదువుతున్న విద్యార్థులకు సైతం ఫీజు మొత్తాన్ని విడుదల చేసి వారి తల్లుల ఖాతాలు జమ చేయబోతున్నట్లు తెలుస్తోంది. దాదాపుగా ఇప్పటికే మూడు సంవత్సరాలుగా జగనన్న విద్యా దీవెన విద్యార్థుల ఖాతాలో వేస్తూనే ఉన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తను ప్రవేశపెట్టిన నవరత్నాలలోని పథకాలలో భాగంగా జగనన్న విద్యా దీవెన పేరుతో ఈ పథకాన్ని అమలు చేయడం జరిగింది. ఇక ఇవే కాకుండా పలు రకాల పథకాలను కూడా అమలు చేస్తూ వచ్చే ఎన్నికలలో కచ్చితంగా గెలవాలని ఉద్దేశంతోనే పనిచేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: