Money: తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం.. రక్షాబంధన్ వేళ..!
ఇప్పటికే మార్కెట్ ను రాఖీలు పూర్తిగా ఆక్రమించేసాయి. ఇక ఒక దాని తర్వాత ఒక పండుగ వస్తున్న నేపథ్యంలో రక్షాబంధన్ , ఫ్రెండ్షిప్ డే అంటూ చాలా బ్యాండ్స్ అమ్ముడు పోతాయి. కాబట్టి మీరు వెరైటీ వెరైటీ రాఖీలను తయారు చేసి మార్కెట్లో విక్రయించవచ్చు ఇంట్లో కూర్చొని రాఖీ తయారు చేస్తే .. ఈ చిన్నపాటి వ్యాపారం మీకే కాదు మీతో పాటు నలుగురు ఆడవాళ్లకు కూడా మంచి ఆదాయాన్ని అందిస్తుంది. గత ఏడాది రాఖీ పండుగ సందర్భంగా సుమారుగా 1000 కోట్ల విలువైన రాఖీలు అమ్ముడుపోయాయి. మీరు కూడా అందమైన, ఆకర్షణీయమైన చౌక ధరకు రాఖీలను తయారు చేసే విక్రయించి డబ్బు పొందవచ్చు.
వాస్తవానికి భారత్ కి , చైనా నుంచి వచ్చే రాఖీల సంఖ్య ఎక్కువే. ఇక చైనా నుంచి ప్రతి ఏటా లక్షలాది రాఖీలు విభినమైన డిజైన్లతో భారత్ కి వస్తూ ఉంటాయి. అందుకే మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో చాలామంది భారతీయులు కూడా చైనాను అధిగమించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంట్లో రాఖీలు తయారు చేసి వాటి ద్వారా ఆదాయాన్ని పొందుతున్నారు. మీరు కూడా రూ .20,000 నుంచి ఈ వ్యాపారాన్ని మొదలు పెడితే భారీ ఆదాయం పొందవచ్చు . రాఖీ తయారు చేయడానికి పట్టు దారం , పూసలు, కాగితం వంటి అలంకార సామాగ్రి అవసరం అవుతాయి. వీటిని పెద్ద మొత్తంలో తయారుచేసి మార్కెట్లో హోల్సేల్ ధరలకు విక్రయించినా కూడా భారీ ఆదాయం వస్తుంది.