Money: ఆడపిల్లల తల్లిదండ్రులకు శుభవార్త.. మూడు రెట్లు లాభం..!
ఇక ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేటును సవరిస్తూ 7.6% గా ఉన్న వడ్డీ రేటును 40 బేసిస్ పాయింట్స్ పెంచి ఎనిమిది శాతానికి చేసిన విషయం తెలిసిందే . అందుకే ఈ పథకంలో పొదుపు చేసిన వారికి రిటర్న్స్ కూడా భారీగా లభిస్తున్నాయి. ముఖ్యంగా సుకన్య సమృద్ధి యోజన పథకానికి సంబంధించిన పూర్తి వివరాల విషయానికి వస్తే.. ఆడపిల్లల పై చదువులు, పెళ్లి ఖర్చుల కోసం పొదుపు చేయడానికి ఈ పథకాన్ని వారి తల్లిదండ్రులు ఎంచుకుంటున్నారు. ఇందులో గరిష్టంగా ప్రతి సంవత్సరం రూ.1,50,000 వరకు జమ చేయవచ్చు. అంతేకాదు సెక్షన్ 80సి కింద పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. 10 సంవత్సరాల వయసు లోపు ఉన్న అమ్మాయిలు ఇందులో చేరడానికి అర్హులవుతారు.
ఉదాహరణకు ఈ పథకంలో ప్రతి సంవత్సరం లక్ష రూపాయల చొప్పున 15 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే మొత్తం 15 లక్షలవుతుంది ప్రస్తుతం వడ్డీ రేటు ఎనిమిది శాతం ప్రకారం లెక్కించుకున్నట్లయితే అమ్మాయి వయసు 21 సంవత్సరాలు వచ్చిన తర్వాత సుమారుగా రూ.45 లక్షల రిటర్న్స్ లభిస్తాయి. అయితే ఈ రిటర్న్స్ కి మీరు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. 15 సంవత్సరాలు వచ్చేవరకు పొదుపు చేసి 18 సంవత్సరాల వయస్సు పూర్తయిన తర్వాత డబ్బు విత్డ్రా చేయవచ్చు . లేదా 21 సంవత్సరల తర్వాత విత్ డ్రా చేస్తే ఎక్కువ రిటర్న్స్ లభిస్తాయి.