Money: ఏపీ మహిళలకు జగన్ శుభవార్త..!

Divya
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. వచ్చే ఎన్నికల వ్యూహాలను ఇప్పటినుంచే అమలు చేస్తూ ఉండడం గమనార్హం. మరీ ముఖ్యంగా మహిళలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాక్షేత్రంలో ప్రజలకు చేరువ అవ్వడానికి పలు సంచలన నిర్ణయాలను కూడా తీసుకుంటున్నారు అందులో భాగంగానే గ్రామీణ అభివృద్ధి శాఖలపై క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన జగన్ గ్రామాలలో సమగ్ర సర్వేపై దృష్టి పెట్టాలని కూడా ఆదేశిస్తూ ఉండడం గమనార్హం.

ఇకపోతే డిజిటల్ లైబ్రరీల నిర్మాణంపై కూడా దృష్టి పెట్టాలి అని, అర్బన్ ప్రాంతాలలో డిజిటల్ లైబ్రరీలను తీసుకురావాలని కూడా ఆయన సూచించారు. స్వయం ఉపాధిని ప్రోత్సహించడానికి చేయూత కింద తగిన ఆర్థిక వసతులను కూడా కల్పించాలని స్వయం ఉపాధి కార్యక్రమాలలో మహిళలకు చేయూతనిచ్చి నడిపించడం చాలా కీలకమని ఆయన తెలిపారు. అందులో భాగంగానే మహిళలకు సున్నా వడ్డీ కార్యక్రమం నిర్వహించాలని కూడా సూచించడం జరిగింది.  ఇకపోతే గ్రామీణ అభివృద్ధి కింద సమీక్ష నిర్వహించాలని.. కార్యక్రమాల పనితీరుపై మదింపు చేయడానికి శాఖలో ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేయాలని జగన్ సూచించడం జరిగింది.

అందులో భాగంగానే ఇటీవల 26వ తేదీన జరగవలసిన వైఎస్ఆర్సిపి నాలుగో విడత ప్రారంభ కార్యక్రమం తాజాగా వరదలు వర్షాల వల్ల వాయిదా వేయడంతో ఈ సున్నా వడ్డీ పథకాన్ని ఆగస్టు 10వ తేదీన నిర్వహించాలని జగన్ భావిస్తున్నారు. స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయడం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ పథకం ద్వారా చాలామంది మహిళలు ఉపాధి అవకాశాలు పొందడానికి వీలుంటుంది. ఇకపోతే వైయస్సార్ హయాంలో పాముల వడ్డీ రుణాలతో ప్రారంభించిన ఈ పథకం ఇప్పుడు 0 వడ్డీ పథకంగా అమలు అవుతుంది. ఇక ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాలు తీసుకున్న రుణాలకు వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందట. ఇక ఈ సంవత్సరం 1.02 కోట్ల మంది డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీని జమ చేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: