అయ్య బాబోయ్.. టమాటాలు అమ్మి.. ఎన్ని కోట్లు సంపాదించాడో తెలుసా?
మొన్నటి వరకు కేవలం ఉల్లిపాయలు కోస్తేనే కన్నీళ్లు వచ్చేవి. కానీ ఇప్పుడు టమాటా కోస్తే కూడా సామాన్యులకు కన్నీళ్లు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలోనే పెరిగిపోయిన రేట్ల కారణంగా ఇక టమాట కొనుగోలు చేయడానికి సామాన్యులు ధైర్యం చేయడం లేదు. ఒకవేళ కొనుగోలు చేసిన ఎంతో ఆచితూచి వాడుతూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇలా పెరిగిపోయిన టమాటా రేట్లు అటు టమాటా రైతులకు మాత్రం భారీగానే లాభాలు తెచ్చి పెడుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇక ఇటీవల కాలంలో టమాటోకు ఏర్పడిన ఏర్పడిన డిమాండ్ ఆధారంగా ఒక రైతు సంపాదించిన ఆదాయం గురించి తెలిసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు.
మహారాష్ట్రలోని పూణేలో జున్నార్ తాలూకాకు చెందిన ఈశ్వర్ గయాకర్ అనే రైతు టమాటా పంట వేసాడు. అయితే ఇటీవల టమాటాకు మార్కెట్లో డిమాండ్ పెరిగిపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తన పొలంలో వేసిన టమాటాలు అమ్మి ఏకంగా 2.8 కోట్ల రూపాయలు సంపాదించాడు ఆ రైతు. గత ఆరేళ్లగా 12 ఎకరాల్లో టమాటా సాగు చేస్తున్నాడట. అయితే ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడూ లాభాలు రాలేదట. కాగా తన టార్గెట్ 3.5 కోట్లు అంటూ ఈ టమాటా రైతు చెబుతూ ఉన్నాడు. అయితే తాను ఒక్కరోజులో కోటీశ్వరుడిని కాలేదని.. కొన్నిసార్లు టమాటా పంట వేసినందుకు భారీగా నష్టాలు కూడా వచ్చాయి అంటూ చెబుతున్నాడు.