Money: రూ.230 ఆదాతో ఊహించని లాభం.. ఎలా అంటే.?
తాజాగా ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ వారు అదిరిపోయే ఇన్సూరెన్స్ పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఈ ప్లాన్ ద్వారా ప్రమాద బీమా పొందే అవకాశం ఉంటుంది ఒకవేళ పాలసీదారుడు ప్రమాదవశాస్తూ మరణిస్తే ఆ కుటుంబానికి బీమా డబ్బులు మొత్తం లభిస్తాయి. మొత్తంరూ .25 లక్షల వరకు కవరేజీతో మీరు ఈ పాలసీని కొనుగోలు చేయవచ్చు. ఇందులో కనీసం రూ .10 లక్షలకు పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మీరు ఎంచుకొనే కవరేజ్ ఆధారంగా మీరు ప్రీమియం కూడా పొందుతారు అని చెప్పవచ్చు.
ఉదాహరణకు మీరు రూ .25 లక్షల మొత్తానికి పాలసీ తీసుకున్నట్లయితే మీకు ప్రీమియం రూ.575 కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ రూ .20 లక్షల మొత్తానికి మీరు పాలసీ తీసుకున్నట్లయితే ప్రీమియం రూ.460 చెల్లించాల్సి ఉంటుంది. లేదు రూ.10 లక్షల మొత్తానికి పాలసీ కొనుగోలు చేయాలి అనుకుంటే అప్పుడు కేవలం 230 రూపాయలు కడితే సరిపోతుంది. అంటే ఏడాదికి ఒకసారి మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది అన్నమాట. 18 నుంచి 55 సంవత్సరాల వయసు కలిగిన ఎవరైనా సరే ఇందులో చేరవచ్చు. ప్రమాదవశాత్తు మరణించినా లేక పాక్షిక అంగవైకల్యం, శాశ్వత అంగవైకల్యం వంటివి సంభవించినా సరే ఈ పాలసీ కవరేజీ వర్తిస్తుంది. అయితే ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే మాత్రం ఈ పాలసీ వర్తించదు. అంతేకాదు ప్రమాదంలో గాయాలు వంటివి తగిలినా.. టెర్రరిస్ట్ ల దాడుల్లో మరణించినా సరే ఈ ఇన్స్యూరెన్స్ వర్తించదు.