Money: అన్నదాతలకు జగన్ సర్కార్ శుభవార్త.!
రాష్ట్ర ప్రభుత్వం పౌరసరఫరాల శాఖలో ఎన్నో మార్పులు తీసుకొచ్చిందని.. ముఖ్యంగా రబీ సీజన్లో 20 లక్షల మెట్రిక్ నెల ధాన్యం కొనుగోలు చేయడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఇందులో 15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రూ.28,402 కోట్ల రూపాయలు వెచ్చించి మరి కొనుగోలు చేశామని ఆయన తెలిపారు. ఇక పౌరసరఫరాల శాఖలో జగన్ సర్కార్ అనేక మార్పులు తీసుకొచ్చిందని.. రైతుల నుంచి ఏకంగా 15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని కూడా స్పష్టం చేశారు. ఇకపోతే ఇప్పటివరకు రైతుల ఖాతాలో నేరుగా రూ.28,200 కోట్లను రైతులకు చెల్లించాము అని మిగిలిన సొమ్మును త్వరలోనే వారి ఖాతాలో జమ చేస్తామని కూడా మంత్రి తెలిపారు.
ఇకపోతే కొంతమంది ప్రభుత్వం పై బురద చల్లేందుకు ప్రయత్నం చేస్తున్నారని గత ప్రభుత్వం హయాంలో దళారీ వ్యవస్థను విపరీతంగా ప్రోత్సహించడం వల్ల రైతన్నలు నష్టపోయారు అని మంత్రి గుర్తు చేశారు. చంద్రబాబు పాలనలో పౌరసరఫరాల శాఖకు భారీగా అప్పుడు మిగిల్చారని కారుమూరి నాగేశ్వరరావు విమర్శించారు. మొత్తానికైతే జగన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రైతుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై డబ్బుకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఎటువంటి మోసాలు జరగకుండా నేరుగా వారి ఖాతాల్లోకి జమ అవుతూ ఉండడం గమనార్హం.