Money: ఈ పథకంలో ఇన్వెస్ట్ చేస్తే రూ.70 లక్షల వరకూ ఆదాయం..!

Divya
ప్రస్తుతం ప్రతి ఒక్కరికి కూడా చిన్న పొదుపు పథకాలే సురక్షితమైన పెట్టుబడి ఎంపికగా పరిగణించబడుతున్న నేపథ్యంలో.. చాలామంది ఇందులోనే మంచి మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. మీరు కూడా అలాగే ఆలోచిస్తున్నట్లయితే ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలంలో మంచి మొత్తం మీరు సంపాదించే అవకాశం ఉంటుంది. ఇక చిన్న పొదుపు పథకాలు అయినా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీమ్, సుకన్య సమృద్ధి యోజన అలాగే సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీం వంటి పథకాలు మీకు మంచి ఆదాయాన్ని అందిస్తున్నాయి. మరీ ముఖ్యంగా నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీమ్ లో పెట్టుబడులు పెట్టడం ద్వారా మీరు ఎంత మొత్తం డిపాజిట్ చేయవచ్చు.. దానివల్ల ఎంత రాబడి వస్తుంది అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
ఐదేళ్లపాటు నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్లో ఇన్వెస్ట్ చేయటం వల్ల మెచ్యూరిటీ పై మీకు వార్షికంగా 7.7% వడ్డీ కూడా లభిస్తుంది. అయితే ఇందులో పెట్టుబడికి పరిమితి లేదు.. మీరు కావాల్సినంత ఇందులో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. లక్ష రూపాయల నుంచి రూ.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టి.. ఐదేళ్లలో మంచి రాబడి పొందవచ్చు. ప్రభుత్వం అందిస్తున్న పథకం కాబట్టి ఇందులో ఇన్వెస్ట్ చేసే వ్యక్తులు కూడా హామీతో కూడిన రాబడిని పొందే వీలు ఉంటుంది. ఇక దీంతో పాటు అనేక ఇతర సౌకర్యాల ప్రయోజనాలను కూడా మీరు పొందవచ్చు.ప్రతి సంవత్సరం పన్ను  మినహా కింద రూ.1.5 లక్షల వరకు మీరు ఆదా చేసుకునే వీలు ఉంటుంది.
ఉదాహరణకు మీరు లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే.. రూ.44,903 వడ్డీ.. ఐదేళ్లలో మొత్తం రూ.1.44 లక్షల డబ్బు మీకు లభిస్తుంది. ఒకవేళ రూ.5 లక్షల పెట్టుబడి పై రూ.2.24 లక్షల వడ్డీ లభిస్తే మొత్తం రూ.7.24 లక్షల ఆదాయం లభిస్తుంది. ఇక మీరు ఐదేళ్లలో 70 లక్షల పొందాలంటే 50 లక్షలు పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ సమయంలో వడ్డీ 22.45 లక్షలు కలుపుకొని రూ. 72.5 4 లక్షల మొత్తం నీ చేతికి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: