Money: పాడి పశువు రైతులకు శుభవార్త ..!

Divya
ఈ మధ్యకాలంలో నిరుద్యోగ సమస్య భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో చాలా మంది యువత ఉద్యోగాల కోసం వెతకడం కంటే ఏదైనా వ్యాపారం చేసి డబ్బు సంపాదిస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారు.. ఈ క్రమంలో ని ఇప్పుడు చెప్పబోయే వ్యాపారం చేస్తే కచ్చితంగా మీకు మంచి రాబడి లభిస్తుంది. ప్రస్తుతం ప్రముఖ డైరీ కంపెనీలతో జతకట్టి నిరంతర ఆదాయంతో పాటు అనేక లాభాలను పొందుతున్నారు యువత . ఈ క్రమంలోనే కరీంనగర్ డైరీ కంపెనీ పాడి రైతులకు మంచి శుభవార్తను అందించింది. తమ డైరీ తో చేతులు కలిపిన వారికి చక్కటి ఆదాయాన్ని ఇవ్వడంతో పాటు అనేక సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తూ దేశంలోనే అగ్రగామిగా ముందుకు దూసుకు వెళ్తుంది.
అసలు విషయంలోకి వెళితే కరీంనగర్ డైరీలో సభ్యత్వం పొందిన పాడి రైతులకు అనేక సంక్షేమ పథకాలను ఆ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. పశువులను కొనుగోలు చేయాలి.. డైరీ ఫార్మ్ ప్రారంభించాలి అనుకుంటే వారికి 60 వేల రూపాయల వరకు కరీంనగర్ డైరీ రుణాన్ని అందిస్తోంది. అంతేకాదు పంజాబ్, హర్యానా వంటి ఇతర రాష్ట్రాల నుంచి పాడి పశువులను కొనుగోలు చేసిన రైతులకు ఆ పశువుల ఇన్సూరెన్స్ లో భాగంగా దాదాపు 90% ఇన్సూరెన్స్ ని కూడా కల్పిస్తోంది. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి పశువులను తీసుకువచ్చే వారికి రవాణా ఖర్చులో 90% కరీంనగర్ డైరీ భరిస్తున్నట్లు సమాచారం.
పశువులకు ఉచిత వైద్యం,  వంద రూపాయలకే కృత్రిమ గర్భధారణ వంటి సదుపాయాలతో పాటు ప్రమాదవశాత్తు పాడి పశువులు మరణించినట్లయితే 7000 రూపాయల వరకు ఆర్థిక సహాయాన్ని కూడా అందజేస్తుంది. అలాగే బాడీ రైతు భరోసా పేరిట ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించగా.. ఇందులో చేరిన రైతు లేదా అతని భార్య ప్రమాదవశాస్తూ మరణిస్తే 50 వేల రూపాయల తక్షణ ఆర్థిక సహాయం కూడా అందజేస్తుంది. ఈ కరీంనగర్ డైరీ ఫార్మ్ తో సభ్యత్వం పొంది . మీ పరిసర ప్రాంతాల్లో ఫార్మ్ పెట్టి అందులో సభ్యత్వం పొందితే మంచి ఆదాయంతో పాటు అంతకుమించి లాభాలను కూడా పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: