Money: మదర్స్ డే సందర్భంగా మహిళలకు గుడ్ న్యూస్..!
తాజాగా శ్రీరామ్ హౌసింగ్ ఫైనాన్స్ హోమ్ లోన్స్ పై.. ప్రాసెసింగ్ ఫీజు తగ్గింపు ఆఫర్ తో మన ముందుకు వచ్చింది.. అంటే ప్రాసెసింగ్ ఫీజులో ఏకంగా 50% డిస్కౌంట్తో మీరు హోమ్ లోన్ పొందవచ్చు అంతేకాదు ఇక్కడ రూ.25 లక్షల వరకు మీకు లోన్ లభిస్తుంది. అది కూడా మదర్స్ డే సందర్భంగా మాత్రమే ఈ ఆఫర్ తీసుకొచ్చినట్లు ఆ కంపెనీ ప్రకటించింది. ఇకపోతే కంపెనీకి చెందిన డైరెక్ట్ 2 కస్టమర్ యాప్ ఎస్ హెచ్ ఎఫ్ ఎల్ ఎస్ ద్వారా హోమ్ లోన్ కోసం అప్లై చేసుకునే వారికి ఈ డీల్ తప్పకుండా అందుబాటులోకి ఉంటుంది.
మీరు బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ యాప్ మీ ఫోన్లో ఉంటే చాలు మీరు నేరుగా లోన్ కి అప్లై చేయవచ్చు లేదంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకొని ఆప్ ద్వారా లోన్ కి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇకపోతే మే నెల మొత్తం ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని శ్రీరామ్ హౌసింగ్ ఫైనాన్స్ ఎండి సీఈవో రవి సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. కస్టమర్లకు యాక్సిసబుల్ , ఆఫర్డబుల్ హౌసింగ్ ఫైనాన్స్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంతోనే కంపెనీ ఈ కొత్త స్కీంతో ఆఫర్ తీసుకొచ్చిందని స్పష్టం చేశారు