మనీ: వేసవికాలంలో మీ ఆదాయాన్ని పెంచే అద్భుతమైన వ్యాపారం ఇదే..!
ఈ వేసవికాలంలో నీళ్ల బాటిళ్లకు చాలా డిమాండ్ ఉంది ఈ సమయంలో మీరు కూడా ఈ బిజినెస్ మొదలుపెట్టి బాగా సంపాదించవచ్చు. పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. అలాగే సంపాదన కూడా చాలా త్వరగా అధిక మొత్తంలో రావడం ప్రారంభం అవుతుంది. మీరు కూడా కొత్తగా వ్యాపారం పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ వ్యాపారం చక్కటి ఆదాయాన్ని అందిస్తుందని చెప్పాలి. ఇకపోతే మార్కెట్లో చాలా బ్రాండ్ల వాటర్ బాటిళ్లు చూసే ఉంటారు. మీరు ఒక లీటర్ , రెండు లీటర్, 5 లీటర్, 10 లీటర్ , 20 లీటర్ల జాడీలను కూడా తయారు చేయవచ్చు. అంతేకాదు మీరే మీ బ్రాండ్ ను ఓన్ గా నిర్మించవచ్చు అలాగే ఈ బాటిల్ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలో ఇప్పుడు చూద్దాం.
వాటర్ బాటిల్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన యంత్రాలు ఇతర వస్తువులను కొనుగోలు చేయాలి అలాగే నిల్వ ట్యాంక్ తో పాటు నీటిని ఫిల్టర్ చేయడానికి 6 యంత్రాన్ని కొనుగోలు చేయాలి . అలాగే ల్యాబ్ నుండి ఫీడ్ వాటర్ టెస్ట్ రిపోర్ట్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ నుండి ఐఎస్ఐ ధ్రువీకరణ, స్థానిక పొల్యూషన్ బోర్డు కార్యాలయం నుండి పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికెట్లు కూడా తీసుకోవాలి . అలాగే స్థానికంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఆరోగ్యశాఖ నుండి వ్యాపార అనుమతులు కూడా పొందాలి . అలాగే జీఎస్టీ రిజిస్ట్రేషన్ కోసం కూడా దరఖాస్తు చేసుకోవాలి. మీకు ఒక లీటర్ వాటర్ బాటిల్ పైన నాలుగు రూపాయల ఆదాయం అనుకుంటే రెండు వేల లీటర్ల నీరు సరఫరా చేస్తే కనీసం రోజుకు 8,000 లాభం మీకు వస్తుంది.