మనీ: మహిళలకు శుభవార్త తెలిపిన ప్రభుత్వం.. నెలకు లక్ష రూపాయలు పక్కా..!

Divya
ప్రస్తుత కాలంలో మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్న విషయం తెలిసిందే. అయితే కొన్నిచోట్ల నేటికీ మహిళలపై వివక్షత కొనసాగుతూనే ఉంది. చదువుకుని ఉద్యోగాలు చేయాలనుకునే మహిళలు చాలామంది ఉన్నారు అయితే పెళ్లి పిల్లలు కుటుంబ బాధ్యతలతో ఇంటికే పరిమితమవుతున్న చాలామంది ఇప్పుడు తమ సొంత కాళ్ళ పై నిలబడాలనే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి మహిళల కోసం మంచి వ్యాపారం గురించి ఇప్పుడు చెప్పబోతున్నాము.. ఉదాహరణకు ఇంటి వద్ద ఖాళీగా ఉండి డబ్బు సంపాదించుకోవాలనుకునే మహిళలకు ప్రత్యేకంగా ఒక బిజినెస్ ఐడియాను తీసుకురావడం జరిగింది.
మీ భర్త , పిల్లలు , కుటుంబం బాధ్యతలను చక్కబెట్టిన తర్వాత రోజులో మీకు కొంచెం ఖాళీ సమయం ఉన్నట్లయితే ఆ సమయాన్ని మీరు ఇక్కడ ఉపయోగించుకోవచ్చు.. ఇక ఆ వ్యాపార ఆలోచనలే ఫ్యాషన్ డిజైనింగ్.. ప్రస్తుతం మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది ప్రతి ఒక్కరూ రకరకాల డిజైనర్ దుస్తులను ధరించడానికి ఆసక్తి చూపుతున్నారు. మీరు కూడా ఫ్యాషన్ డిజైనింగ్ చేసినట్లయితే చక్కటి ఆదాయాన్ని పొందడమే కాదు అంతకుమించి మంచి పేరు కూడా లభిస్తుంది.  ఇకపోతే దీనినే మీరు వ్యాపారంగా మార్చుకొని మంచి లాభాలను పొందవచ్చు.
ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఫ్యాషన్ డిజైనింగ్ , అడ్వాన్స్డ్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులను ఆఫర్ చేస్తోంది.  కేవలం 3000 రూపాయల ఫీజు చెల్లించి కోర్స్ నేర్చుకోవచ్చు.  మూడు నెలల లోనే మీరు కోర్స్ కంప్లీట్ చేస్తారు. ముఖ్యంగా ఈ కోర్స్ చేయాలంటే మీరు పదవ తరగతి ఫెయిల్ అయినా  సరే అర్హులనే చెప్పాలి. ఇక ఈ సర్టిఫికెట్ కోర్స్ ద్వారా మీరు బ్రాండెడ్ బోటిక్ షాపుల్లో కూడా ఉద్యోగం సంపాదించుకోవచ్చు.  లేదంటే సొంతంగా మీరే బొటిక్ తెరవచ్చు. విదేశాల్లో పలు గార్మెంట్ సంస్థలు కూడా ఫ్యాషన్ డిజైనర్ లను నియమించుకుంటున్న నేపథ్యంలో జీతాలు కూడా ఆఫర్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వ్యాపారంతో మీ ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: