మనీ: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!
ఆలిండియా రైల్వే మాన్ ఫెడరేషన్ కార్యదర్శి శివగోపాల్ మేస్త్రి తాజాగా ఒక వార్త మీడియా సంస్థతో మాట్లాడుతూ డిసెంబర్ -2022 న cpi -IW 2023 జనవరి 31న విడుదలైందని తెలియజేశారు. DA పెంపు 4.23 గా లెక్కలు చెబుతున్నాయని తెలియజేశారు. అయితే ఉన్నదానిలో పెంచేందుకు ప్రభుత్వం అంగీకరించలేదని తెలియజేశారు. అందువల్లే DA 4 శాతం తిరగవచ్చు అని కూడా తెలియజేయడం జరిగింది. ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యవసాయా శాఖ ఈ DA ను పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసిందని తెలియజేశారు . ఈ పెంపు వల్ల భరించాల్సిన పర్యవసానాలను వివరిస్తుందని తెలియజేయడం జరిగింది ఇందుకు సంబంధించి కేంద్ర క్యాబినెట్ ఆమోదం కోసం వేచి చూస్తున్నారు.
ఒకవేళ DA ను పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లయితే.. పెంచిన DA ను 2023 జనవరి ఒకటి నుంచి వర్తిస్తుందట . అయితే 12 నెలల వారి ధరల సగటు ఆధారంగా ఈ డీఎన్ నిర్ణయించబోతున్నట్లు తెలుస్తోంది. అప్పుడు కూడా నాలుగు శాతమే పెంచడం జరిగింది. పెరిగిన ధరల భారానికి పరిహారంగానే ఈ DA ప్రభుత్వం చెల్లిస్తోందని సమాచారం. కొంతకాలంలో జీవన వ్యయం పెరుగుతూ ఉండడంతో ఇలాంటి నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.