మనీ: ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ప్రతి యేటా రూ.లక్షలు..!

Divya
ప్రస్తుతం ప్రజల ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం రకరకాల పథకాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ముఖ్యంగా వీటిలో ప్రధానమంత్రి వయోవందన యోజన కూడా ఒకటి. ఈ స్కీంలో చేరడం వల్ల పలు రకాల ప్రయోజనాలను కూడా పొందవచ్చు. 2023 మార్చి 31 వరకు ఈ పథకంలో చేరడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఈ పథకం మీకు అందుబాటులో ఉండదు అని కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇకపోతే వచ్చే బడ్జెట్లో ఈ స్కీం గడువు పొడిగించే ఛాన్స్ ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు.
దేశీయ దిగ్గజ భీమా రంగ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ స్కీం నిర్వహణ బాధ్యతలు చూసు కుంటుంది. ప్రధానమంత్రి వయో వందన యోజన పథకం కేవలం 60 ఏళ్ల వయసు సీనియర్ సిటిజనులకు మాత్రమే అందుబాటులో ఉండే విధంగా ప్లాన్ చేశారు. ముఖ్యంగా 2020లో ప్రధాని మోదీ ఈ పథకాన్ని ఆవిష్కరించగా ఇందులో చేరిన సీనియర్ సిటిజన్స్ కు 7.4% వడ్డీ రేటును కూడా అందిస్తోంది గరిష్టంగా ఈ స్కీం కింద రూ.15 లక్షల వరకు మీరు డిపాజిట్ చేసుకుని అవకాశం ఉంటుంది.
ఉదాహరణకు మీరు రూ.15 లక్షల డిపాజిట్ చేస్తే 7.4% వడ్డీ రేటు ప్రకారం మీకు ఏడాదికి రూ.1.1లక్షల వడ్డీ లభిస్తుంది. ఈ పాలసీ టర్మ్ పదేళ్లు అంటే ప్రతి ఏటా మీకు రూ.1.1 లక్షలు చేతికి వస్తూనే ఉంటాయి. అయితే ఈ పథకంలో చేరాలనుకునే వారు కనీసం రూ.1,56,658 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.. ఇకపోతే ఎల్ఐసి వెబ్సైట్ ప్రకారం చూసినట్లయితే ఈ స్కీంలో చేరడం వల్ల కనీసం నెలకు వెయ్యి రూపాయల పెన్షన్ కూడా లభిస్తుంది. గరిష్టంగా రూ.9,250 పెన్షన్ ప్రతినెల పొందవచ్చు అంటే మీరు ఇన్వెస్ట్ చేసే డిపాజిట్ పైన మీకు వచ్చే పెన్షన్ కూడా ఆధారపడి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: