మనీ: కస్టమర్లకు మరో బంపర్ గిఫ్ట్ ప్రకటించిన బ్యాంక్..!

Divya
చాలామంది భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకొని పలు ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంకులలో డబ్బులను ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటూ వాటిపై వచ్చే వడ్డీ పైన ఆధారపడి తమ కెరియర్ ను కొనసాగిస్తూ ఉంటారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ ఇలాంటి పద్ధతుల్లోనే ఎక్కువగా డబ్బు దాచుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు . ఈ క్రమంలోనే అలా ఫిక్స్డ్ డిపాజిట్ చేసే కష్టమర్లకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించాయి ప్రభుత్వరంగ బ్యాంకులు.. ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన కెనరా బ్యాంకు కూడా తాజాగా కష్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని కీలక నిర్ణయం తీసుకుంది.
ఎవరైతే రూ.2 కోట్లలోపు ఫిక్స్ డిపాజిట్లు చేస్తారో వాటిపై వడ్డీ రేట్లు పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఫిక్స్డ్ డిపాజిట్ రేట్ల పెంపు అమలులోకి వచ్చిన నేపథ్యంలో బ్యాంకులో డబ్బులు దాచుకోవాలని భావించే వారికి ఊరట కలుగుతుందని చెప్పవచ్చు.  గతంలో కంటే ఇప్పుడు బ్యాంకులో డబ్బులు దాచుకునే వారి సంఖ్య ఎక్కువ అవుతుంది.. ముఖ్యంగా కెనరా బ్యాంకు పెంచిన ఫిక్స్డ్ డిపాజిట్లు రేట్లు గమనించినట్లయితే ఏడు రోజుల నుంచి 10 సంవత్సరాల టెన్యూర్ లోని ఫిక్స్డ్ డిపాజిట్ లపై వడ్డీ రేటు 3.25% నుంచి 7.15% వరకు ఉంటుంది అని స్పష్టం చేసింది. ఇది రెగ్యులర్ కస్టమర్లకు వర్తిస్తుంది అని అదే సీనియర్ సిటిజన్స్ కైతే 7.65% వరకు వడ్డీ లభిస్తుంది అని స్పష్టం చేసింది.
400 రోజుల ఫిక్స్ డిపాజిట్ ల పై వడ్డీ రేటు 7.15% గా ఉంటుందని స్పష్టం చేసింది. అదే సీనియర్ సిటిజన్స్ కైతే వడ్డీ రేటు 7.65 శాతంగా ఉంది. ముఖ్యంగా నాలుగు వందల రోజులకు ఫిక్స్డ్ డిపాజిట్లు చేసేవారు రూ. 15 లక్షలకు పైగా ఫిక్స్ డిపాజిట్ చేస్తేనే సామాన్య ప్రజలకు 7.45% సీనియర్ సిటిజన్లకు 7.75% వడ్డీ లభిస్తుంది. వడ్డీ కూడా మీరు ఇన్వెస్ట్ చేసే ప్రాతిపదికన ఆధారపడి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: