మనీ: ఇది కదా అసలైన లాభం అంటే..!
ఈ బిజినెస్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు.. ఏడాదికి రూ.4 లక్షల ఆదాయం కూడా వస్తుందని తెలుస్తోంది. అయితే ఖర్చు కూడా రూ.80 వేల వరకు అవుతుంది. ఆ బిజినెస్ ఏమిటంటే ఔషధ మొక్కల సాగు పైన ఎవరికైనా అవగాహన ఉంటే కచ్చితంగా వీటివల్ల ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చు. ఔషధ మొక్కలలో సర్పగంధ చాలా ప్రాధాన్యతని కలిగి ఉంది. ఈ మొక్కల ద్వారా సాగు చేసి ఎక్కువ డబ్బులను సంపాదించుకోవచ్చు. ఈ మొక్కలు ఎక్కువగా ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తూ ఉంటారట. ఈ పంటని మనం ఒక్కసారి మొదలుపెట్టామంటే ఏడాదిలో పంట చేతికి వస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు.
ఈ మొక్కలకు పూలు, పండ్లు, కాయలు , వేర్లు కూడా అన్ని మందులకు బాగా ఉపయోగిస్తూ ఉంటారట కాబట్టి . ఈ పంటకి కాపలా ఉండాల్సిన పని కూడా ఉండదు కేవలం ఈ పంట పండించడానికి భూమి కాస్త జిగురుగా ఉండే నెల అయితే నిపుణులు తెలియజేస్తున్నారు. నల్ల మట్టి నేలలు కూడా ఈ పంటకు చాలా అనుకూలంగా ఉంటాయి ఎలాంటి వాతావరణంలో నైనా సరే ఈ పంట బాగా పండుతుందట. సేంద్రియ పదార్థాలని నైట్రోజన్ మట్టిలో కలపాలి అలానే మట్టిలో రాళ్లు లేకుండా చూసుకోవాలి ఈ పంట జూన్ , ఆగస్టు మధ్య సాగు చేసినట్లు అయితే మంచి ఫలితం లభిస్తుంది. ఎకరానికి 30 కేజీల విత్తనాలు అవసరమవుతాయి.