మనీ: కొత్త ఏడాది కస్టమర్లకు అదిరిపోయే ప్రకటన చేసిన బ్యాంక్..!
ప్రస్తుతం డిసెంబర్ 20 వరకు ఈ ప్రమోషనల్ ఆఫర్ అందుబాటులో ఉంది. అంటే సాధారణ ప్రజలకు 9.01% వడ్డీ, సీనియర్ సిటిజన్లకు 9.26% వడ్డీ లభిస్తుంది. మూడు టెన్యూర్ల పై వడ్డీ రేట్లు 50 బేసిస్ పాయింట్లు నుంచి 226 బేసిస్ పాయింట్ల వరకు పెరిగాయని బ్యాంకు తెలిపింది. ముఖ్యంగా ఏడు రోజుల నుంచి 10 సంవత్సరాల టెన్యూర్ తో బ్యాంకులో డబ్బులు దాచుకోవచ్చని .. రూ.రెండు కోట్ల వరకు డిపాజిట్లు స్వీకరిస్తున్నట్లు కూడా బ్యాంకు వెల్లడించింది. బ్యాంకులో డబ్బులు దాచుకునే వారికి వడ్డీ రేటు 4 శాతం నుంచి ప్రారంభం అవుతుంది.
9.01% వరకు వడ్డీని పొందవచ్చు. అలాగే సీనియర్ సిటిజన్స్ కి వడ్డీ రేటు 4.5% నుండి ప్రారంభం అవుతుంది. గరిష్టంగా 9.26% వరకు వడ్డీ పొందవచ్చు. బ్యాంక్ అందిస్తున్న అధిక వడ్డీ రేట్లు కూడా ఇవే కావడం గమనార్హం. ముఖ్యంగా మీరు పెట్టిన డబ్బులకు ఇబ్బంది ఉండదు . డిపాజిట్ ఇన్సూరెన్స్ స్కీం కూడా వర్తిస్తుంది. ఐదు లక్షల వరకు బీమా వస్తుంది కాబట్టి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అని ఆలోచించాల్సిన పని లేకుండా మరింత రాబడిని పొందవచ్చు.