మనీ: రూ.20 ఆదాతో కోటి రూపాయలు..!

Divya
తాజాగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జీవన్ అమర్ , టెక్ టర్మ్ పాలసీలను నిలిపివేసి వాటి స్థానంలో అవే పేర్లతో కొత్తగా రెండు పాలసీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎల్ఐసి న్యూ టెక్ టర్మ్ ప్లాన్ విశేషాలు చూస్తే ఈ రెండు పాలసీల బెనిఫిట్స్ దాదాపు ఒకేలా ఉన్నాయి. అయితే ఎల్ఐసి న్యూ టెక్ టర్మ్ పాలసీ ఆన్లైన్ లో మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఎల్ఐసి అధికారిక వెబ్సైట్లో మాత్రమే ఈ పాలసీని మీరు తీసుకునే ఆస్కారం ఉంటుంది. ఎల్ఐసి అధికారిక వెబ్సైటులో మీరు నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ , ఇండివిజువల్, ప్రీమియం లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.
అయితే ఎల్ఐసి న్యూ టెక్ టర్మ్ ప్లాన్ 18 నుంచి 65 సంవత్సరాల లోపు వయసు ఉన్నవారు ఎవరైనా తీసుకోవచ్చు. 80 సంవత్సరాల లోపు మెచ్యూరిటీ వయసు ఉంటుంది.  కనీస అశ్యూర్డ్ రూ. 50 లక్షలు కాగా గరిష్ట పరిమితి ఏమీ లేదు. ఈ పాలసీ టర్మ్ 10 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఎల్ఐసి న్యూ జీవన్ అమర్ ప్లాన్ లో ఉన్నట్టుగానే రెగ్యులర్ ప్రీమియం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్స్ ఉంటాయి. రెగ్యులర్ ప్రీమియంలో పాలసీ టర్మ్ మొత్తం ప్రీమియం చెల్లించాలి.  లిమిటెడ్ ప్రీమియంలో పాలసీ టర్మ్ కన్నా 10 సంవత్సరాల ముందు వరకు ప్రీమియం చెల్లించవచ్చు.
ఉదాహరణకు 20 ఏళ్ల వయసున్న ఒక వ్యక్తి ఆప్షన్ వన్ ఎంచుకొని 20 ఏళ్ల పాలసీ టర్మ్ తో కోటి రూపాయల పాలసీ తీసుకున్నట్లయితే రెగ్యులర్ ప్రీమియం అయితే ఏడాదికి రూ.7,047 అలాగే జీఎస్టీ కూడా చెల్లించాలి అంటే రోజుకు రూ.20 లోపే.. ఆ వ్యక్తి 20 ఏళ్లపాటు రోజుకు 20 రూపాయల చొప్పున ఆధార్ చేస్తే ఈ పాలసీ టర్మ్ కింద కోటి రూపాయల కవరేజీ లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: