మనీ: భార్యాభర్తలిద్దరికీ శుభవార్త తెలిపిన పోస్టల్ శాఖ..!

Divya
చేతిలో డబ్బులు ఉండి ఎందులోనైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలని భావిస్తూ ఉంటే.. పోస్ట్ ఆఫీస్ లో మంచి అవకాశాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం పోస్టల్ శాఖలో రకరకాల పథకాలను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో భార్యాభర్తలిద్దరికీ కూడా శుభవార్త తెలిపింది. ప్రస్తుతం తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి వచ్చే స్కీములు కూడా చాలానే ఉన్నాయి. పోస్ట్ ఆఫీస్ లో ఎన్నో ఆకర్షణీయమైన పథకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో భార్యాభర్తలు ఇద్దరికీ కూడా నెల నెల సంపాదించే పథకం కూడా ఒకటి ఉంది. ఈ పథకం ద్వారా వారు వార్షికంగా రూ.59,400 వరకు రాబడి ఉంటుంది.

ఇకపోతే ఈ స్కీం ద్వారా నెల నెల రూ.4950 వరకు పొందవచ్చు. ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీం కింద భార్యాభర్త ఇద్దరు కూడా ప్రతి నెల కొంత డబ్బు పొందవచ్చు.  అయితే ఈ పథకంలో చేరితే జాయింట్ అకౌంట్ ని తెరవాలి. జాయింట్ అకౌంట్ ద్వారా అయితే ఈ అకౌంట్ లో మీ డబ్బులు రెట్టింపు అవుతాయి. ఈ పథకంలో కనీసం వెయ్యి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది గరిష్టంగా రూ.4.5 లక్షల వరకు ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. ఒకవేళ జాయింట్ గా మీరు అకౌంట్ తీసుకున్నట్లయితే రూ.69 లక్షలు వరకు గరిష్టంగా డిపాజిట్ చేసుకోవచ్చు.

పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు,  సీనియర్ సిటిజనులకు ఈ స్కీమ్ ఎంతగానో ఉపయోగపడుతుంది .ఈ స్కీం ద్వారా పోస్ట్ ఆఫీస్ లో ఇద్దరూ లేదా ముగ్గురు కలిసి జాయింట్ అకౌంట్ తెరవచ్చు.  అయితే ఈ జాయింట్ అకౌంట్ తీసిన తర్వాత ఏ సమయంలోనైనా సరే సింగిల్ గా మార్చుకుని వెసులుబాటు ఉంటుంది. అలాగే సింగిల్ అకౌంట్ ను జాయింట్ అకౌంట్ గా కూడా మార్చుకోవచ్చు. అంతేకాదు 6.6% వడ్డీ కూడా లభిస్తుంది ఉదాహరణకు జాయింట్ అకౌంట్ తీసుకొని రూ.9లక్షలు డిపాజిట్ చేస్తే వడ్డీ కలుపుకొని ఏడాదికి రూ.59,400 అవుతుంది. ఈ మొత్తాన్ని 12 భాగాలుగా విభజిస్తే మీకు ప్రతి నెల 4950 రూపాయలు పెన్షన్ రూపంలో వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: