మనీ: పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువ.. బెస్ట్ బిజినెస్ ఐడియా..!
ప్రస్తుతం ఉన్న గజిబిజి లైఫ్ స్టైల్ లో ప్రతి ఒక్కరు కూడా వంటల్లో ఉల్లి పేస్టును ఉపయోగిస్తూ ఉంటారు. అయితే దీనినే మీరు క్యాష్ చేసుకోవచ్చు. ఉల్లి పేస్టుకి డిమాండ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మీరు దీనిని వ్యాపారంగా మార్చుకొని మరింత లాభం పొందవచ్చు. అయితే ఈ బిజినెస్ మొదలుపెట్టేముందు విలేజ్ ఇండస్ట్రీ కమిషన్.. ఉల్లిముద్ద తయారీ వ్యాపారం పై ప్రాజెక్టు రిపోర్టులు కూడా సిద్ధం చేసింది. ఈ వ్యాపారం చేయడానికి మీకు నాలుగున్నర లక్షల రూపాయలు ఖర్చవుతుంది. పెట్టుబడి కోసం మీరు భయపడినాల్సిన అవసరం లేదు. ముద్ర స్కీం ద్వారా లోన్ కూడా పొందుతారు.
ఈ వ్యాపారం చేయడానికి కుక్కర్, మిక్సీ, గిన్నెలు మొదలైన సామాన్లు అవసరమవుతాయి. అలాగే ప్యాకింగ్ కు సంబంధించిన సామాన్లు కూడా మీరు అదనంగా తీసుకోవాలి .అయితే ఈ వ్యాపారం చేయాలనుకుంటే మాత్రం ప్యాకింగ్ కి సంబంధించి, తయారీకి సంబంధించి ఏదైనా సందేహాలు ఉంటే తప్పకుండా ఆన్లైన్లో నివృత్తి చేసుకోవాలి. మీరు సోషల్ మీడియా ద్వారా మీ వ్యాపారాన్ని విస్తరించవచ్చు. చాలామంది సోషల్ మీడియా ద్వారా తమ బిజినెస్లను ప్రమోట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మీరు మంచిగా మొదలుపెట్టి చక్కగా లాభాలను పొందవచ్చు. ఏదేమైనా ఈ వ్యాపారంతో చక్కటి ఆదాయాన్ని పొందవచ్చు. ఇకపై నిరుద్యోగ సమస్య అనేది లేకుండా ఇలాంటి వ్యాపారాలు చేస్తూ కూడా డబ్బు సంపాదించవచ్చు.