మనీ: రూ.4 లక్షలు రిస్క్ లేకుండా పొందండిలా.!
మీరు పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి ఈ పథకంలో చేరవచ్చు. ఈ పథకంలో చెబితే 6.8% వడ్డీ కూడా లభిస్తుంది. మెచ్యూరిటీ సమయంలో వడ్డీ, అసలు రెండు కూడా కలిపి చెల్లిస్తారు. సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కోరుకునే వారికి ఇది అణువుగా ఉంటుంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీం క్యాలిక్యులేట్ ప్రకారం 5 సంవత్సరాల లో 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 6.8% వడ్డీ రేటు ప్రకారం మీరు మెచ్యూరిటీ సమయంలో రూ. 14 లక్షలు పొందవచ్చు. అంటే ఐదేళ్లలోనే రూ.4 లక్షల లాభం వస్తుంది.. రూ.10 లక్షలు కాకుండా రూ.ఐదు లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఐదేళ్ల తర్వాత మీకు రూ.7 లక్షలు వస్తాయి.. అంటే మీకు వడ్డీ రూపంలో అదనంగా రూ.రెండు లక్షలు లభిస్తాయి అన్నమాట.
ఇలా మీరు డిపాజిట్ చేసే ప్రాతిపదికన మీకు వచ్చే రాబడి కూడా మారుతూ ఉంటుంది. నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ అకౌంట్ ని ఎవరైనా ఓపెన్ చేయవచ్చు. జాయింట్ అకౌంట్ ఫెసిలిటీ కూడా ఉంది. 1000 రూపాయల కనీసం మొత్తంతో ఈ పథకం కింద మీరు డిపాజిట్ చేయవచ్చు. గరిష్ట పరిమితి ఏమీ లేదు. కాబట్టి ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకుని అవకాశం ఉంటుంది.. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ స్కీం మెచ్యూరిటీ సమయం ఐదు సంవత్సరాలు కాబట్టి పూర్తయిన తర్వాతనే డబ్బులు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.