మనీ: ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..!
ఈనెల చివరి కల్లా పెండింగ్లో ఉన్న బకాయిలపై కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోనుంది. నిర్ణయం తీసుకున్న వెంటనే బకాయిల మొత్తం డబ్బు ఉద్యోగుల అకౌంట్లో జమ కానున్నాయి. లెవెల్ వన్ ఉద్యోగులకు డిఏ బకాయిలు రూ.11,880 నుంచి రూ.37,554 వరకు పడనున్నాయి 11:30 ఉద్యోగుల కైతే ఏడో సి పి సి బేసిక్ పే స్కేల్ ప్రకారం రూ.1,23,100 నుంచీ రూ.2,15,900 వరకు పొందే అవకాశం ఉంది. లెవెల్ 14 ఉద్యోగులకు రూ.1,44,200 నుంచీ రూ.2,18,200 వరకు పొందుతారు. జనవరి 1 2020 నుంచి జూన్ 20 2021 వరకు అంటే దాదాపు 18 నెలల డిఏ బకాయిలు చాలా ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్నాయి.
అందుకే డైరెక్ట్ గా ఉద్యోగులు పెన్షనర్ల అకౌంట్లోనే బకాయిలను చెల్లించాలని కేంద్రం ఆలోచిస్తుంది . రిటైల్ ద్రవ్యోల్భనం పెరగడం వల్ల డిఎ, డిఆర్ చెల్లింపును ఆపేసారని మరోవైపు పెట్రోల్, డీజిల్ , ఆయిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ఇటువంటి సమయంలో వెంటనే పెండింగ్లో ఉన్న బకాయిలు చెల్లించాలని పెన్షనర్లు కూడా కోరుతున్నారు.