మనీ: ఈ వ్యాపారంతో రైతులకు రూ.లక్షల్లో ఆదాయం..!!

Divya
ఇటీవల కాలంలో చాలామంది ఉన్న ఉద్యోగాన్ని కూడా వదిలేసి ఎక్కువగా వ్యవసాయం చేస్తూ విపరీతంగా సంపాదించే పనిలో పడ్డారు. ఇక ఈ క్రమంలోనే సాంప్రదాయ పంటలతోపాటు వాణిజ్య పంటలను పండిస్తూ జాబ్ కన్నా ఎక్కువ ఆదాయం పొందుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాంటి వాణిజ్య పంటలలో వెల్లుల్లి పంట కూడా ఒకటి. ముఖ్యంగా వెల్లుల్లి సాగు ద్వారా రైతులకు విపరీతమైన లాభాలు వస్తున్నాయి.. వెల్లుల్లి సాగు ద్వారా మొదటి పంట లోనే ఆరు నెలల్లో రూ.10 లక్షల వరకు సంపాదించవచ్చు. ఇక ఈ క్రమంలోనే మన దేశంలో చాలామంది యువత ఇలా వెల్లుల్లి పండించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ఇకపోతే మనదేశంలో ఏడాది పొడవునా డిమాండ్ ఉండే వెల్లుల్లి పంట కావడంతో దీనికి ఎక్కువగా డిమాండ్ పెరుగుతుంది. కేవలం సుగంధ ద్రవ్యంగా మాత్రమే కాకుండా ఔషధంగా కూడా ఉపయోగిస్తున్నారు. వెల్లుల్లిని కూరగాయలు, ఊరగాయలు, మసాలా దినుసులుగా కూడా ఉపయోగిస్తూ ఉండడం గమనార్హం ఇక అంతేకాదు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు.. కడుపు వ్యాధులు ,జీర్ణ సంబంధిత సమస్యలు,  క్యాన్సర్ ,కీళ్ల నొప్పులు,  ఊపిరితిత్తులు , నపుంసకత్వం వంటి సమస్యలకు వెల్లుల్లి చాలా చక్కగా పనిచేస్తుంది. ఇకపోతే యాంటీబ్యాక్టీరియల్,  క్యాన్సర్ నిరోధక గుణాలు కలిగి ఉండడం వల్ల వివిధ రకాల మందుల్లో కూడా ఉపయోగిస్తున్నారు.

ఇక వాన కాలం ముగిసిన తర్వాత మాత్రమే వెల్లుల్లి సాగు చేయడం మొదలు పెట్టాలి . అంటే అక్టోబర్,  నవంబర్ నెలలో ఈ సాగు చేయడానికి అనుకూలమైన సమయం.. వెల్లుల్లిని దాని మొగ్గలనుంచి పండిస్తారు ఒక్కొక్క మొగ్గ నాటడానికి 10 సెంటీమీటర్ల దూరం ఉండాలి.. ఏ నేలలో అయినా సరే సాగు చేయవచ్చు. కానీ నీరు ఎక్కువగా నిలిచిపోతే పంట దెబ్బతింటుంది కాబట్టి నీరు ఎక్కువగా నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.  కేవలం 5, 6 నెలల్లోనే కోతకు వస్తుంది. ఒక ఎకరంలో వెల్లుల్లి సాగు చేయాలి అంటే రూ.40 వేల వరకు ఖర్చు అవుతుంది.  మార్కెట్లో ఒక క్వింటా వెల్లుల్లి ధర రూ.21 వేల వరకు పలుకుతోంది . కాబట్టి మీకు ఖచ్చితంగా విపరీతమైన లాభం వస్తుందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: