జీతం ఎంత వచ్చినా రూపాయి నిలవడం లేదా... ఈ 4 అలవాట్లు ఉన్నాయా ?

VAMSI
ప్రస్తుతం మనం జీవిస్తున్న ఈ ప్రపంచంలో జరుగుతున్న చాలా ఘటనలు డబ్బు కోసం మాత్రమే. ఇది ఎవ్వరూ కాదనలేని సత్యం.. ప్రతి ఒక్కరూ తమకు ఇష్టం ఉన్న లేకపోయినా ఏదో ఒక ఉద్యోగం చేస్తూ జీవితాన్ని గడుపుతుంటారు. అయితే వారు సంపాదించే డబ్బును సరిగా ఖర్చు చేస్తున్నారా ? ఒకవేళ సరిగా ఒక ప్రణాళిక ప్రకారం చేస్తుంటే ముందు ముందు ఎటువంటి అవసరాలు వారికి వచ్చినా సులభంగా తీర్చుకుంటూ వెళుతారు. అలా కాకుండా వచ్చినా జీతాన్ని జీవితంలో అవసరం లేని వాటి కోసం ఖర్చు పెడుతూ ఉంటే చాలా కష్టాలు పాలవుతారు. అందుకే ఇక్కడ మనము కొన్ని అలవాట్ల గురించి తెలుసుకుందాం . ఈ అలవాట్లు కనుక ఉంటే ఎంత డాబు సంపాదించినా జేబులు చిల్లులు పడడం ఖాయం. అందుకే కింది చెప్పబోయే అలవాట్లకు మనము శుభం పలికి మంచి జీవితాన్ని పొందుదాము.
చెడు ఆర్ధిక అలవాట్లు: ఎప్పుడో వచ్చే జీతం ను దృష్టిలో పెట్టుకుని ఖర్చులు చేసుకుంటూ పోతారు. ఉదాహరణకు: బాగా ఆకలిగా ఉంది. కొంచెం ఏదైనా అన్నం తింటే కేవలం 50 రూపాయలతో కడుపునిండి పోతుంది. కానీ పిజ్జా బిరియానీ అని తింటే 400 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇలా దేనికి ఎంత ఖర్చు చేయాలో తెలియని వారు ఖచ్చితంగా భవిష్యత్తులో ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటారు.
డబ్బు దోపిడి: మన సంపాదన ను బట్టి మాత్రం ఏదైనా కొనాలి.. అంతే కానీ ఎదుటివారిని చూసి వారికి కారు ఉంది కదా అని మన దగ్గర లేకపోయినా అప్పు చేసి కారు కొంతే మనకే నష్టం. అందుకే మీ సంపాదనను ఖర్చులను బేరీజు వేసుకుని జీవితాన్ని నడిపించాలి. ఇక కహ్ర్చులకు పోగా ఎంతో కొంత మొత్తాన్ని పొదుపు చేసుకోవడం కూడా చాలా అవసరం.
వృధా షాపింగ్ : మీకు అవసరం అయిన బట్టలను సాధారణ షాప్ లలో కొనుగోలు చేస్తే... సరిపోతుంది. కానీ దాని కోసం పెద్ద పెద్ద షాపింగ్ మాల్ లలో బట్టలు కొంతే జేబులు చిల్లులు పడ్తాయి.
ఫ్రెండ్స్ పార్టీలు: మనకు అవసరాలు ఉన్నప్పుడు దాచే ప్రతి రూపాయి చాలా విలువైనది అని గుర్తుంచుకోండి. కాబట్టి తరచూ ఫ్రెండ్స్ తో పార్టీలకు వెళ్లడం మానుకోండి.
ఇలా కొన్ని అలవాట్లను మనము మార్చుకుని, మరి కొన్నిటినీ తగ్గిచుకుంటే ఆర్ధికంగా ఇబ్బందులు పడకుండా జీవించవచ్చు.
   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: