మనీ: సీనియర్ సిటిజన్స్ కు శుభవార్త.. పెరగనున్న వడ్డీ రేట్లు..!

Divya
చాలామంది డబ్బులను దాచుకోవడానికి బ్యాంకులను, పోస్ట్ ఆఫీస్ లను ప్రధమంగా ఎంచుకుంటున్న విషయం తెలిసిందే. ఇకపోతే కొంతమంది నెలవారి ప్రకారం డబ్బులను దాచుకుంటే..చాలామంది ఒకేసారి డబ్బులను ఫిక్స్ డిపాజిట్ చేసుకుంటున్నారు. అలా ఫిక్స్డ్ డిపాజిట్లు చేసిన వాటిపై వడ్డీ రేట్లు పెంచుతూ సీనియర్ సిటిజనులకు భారీగా ప్రయోజనాలను అందిస్తున్నాయి బ్యాంకులు మరియు సీనియర్ సిటిజన్స్ కోసం ఏకంగా నాలుగు బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశాయి. ఇక అందులో కరూర్ వైశ్యా బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ , సిటీ యూనియన్ బ్యాంక్ తో పాటు కర్ణాటక బ్యాంకులు రూ.2కోట్ల లోపు ఉన్న ఫిక్స్ డిపాజిట్ లపై వడ్డీరేట్లు పెంచుతున్నట్లు ప్రకటించడం జరిగింది.
కరూర్ వైశ్యా బ్యాంక్:
వారం నుంచి నెల రోజులలోపు ఫిక్స్ డిపాజిట్లు పై 4 శాతం వడ్డీని కరూర్ వైశ్యా బ్యాంక్ ఇస్తూ ఉండగా ఇక 90 రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఫిక్స్ డిపాజిట్లు పై 5.25 శాతం వడ్డీని ఇవ్వనున్నారు.  120 రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఫిక్స్ డిపాజిట్లు పై 5.5%, 180 రోజుల్లో ఫిక్స్ డిపాజిట్ లపై  5.50 శాతం ఫిక్స్ చేశారు. ఇక మూడు సంవత్సరాల వరకు ఉన్న ఫిక్స్ డిపాజిట్ ల పై 6.1% వడ్డీని ఇస్తూ ఉండడం గమనార్హం

కోటక్ మహీంద్రా బ్యాంకు:
390 రోజుల నుంచి 23 నెలల మధ్య మెచ్యూర్ అయ్యే ఫిక్స్డ్ డిపాజిట్ ల పై కోటక్ మహీంద్రా బ్యాంక్ 6% వడ్డీని అందిస్తోంది.  ఇక ఈ కొత్త రేట్లు సెప్టెంబర్ 6వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. ముఖ్యంగా రెండు సంవత్సరాలలోపు ఫిక్స్డ్ డిపాజిట్ ల పై 6.10 శాతం వడ్డీ ఉండగా 10 సంవత్సరాలకు ఫిక్స్ డిపాజిట్ లపై 6.20 శాతం వడ్డీ ఇవ్వబడుతుంది.

సిటీ యూనియన్ బ్యాంక్ :
సిటీ యూనియన్ బ్యాంకు లో 10 సంవత్సరాలలోపు మెచ్యూర్ అయ్యే ఫిక్స్ డిపాజిట్లు పై 5. 75%.. ఇక పన్ను ఆదా చేసే ఫిక్స్ డిపాజిట్ లపై 6 శాతం వడ్డీ అందుబాటులో ఉంటుంది.

కర్ణాటక బ్యాంక్:
కర్ణాటక బ్యాంకు రూ. రెండు కోట్ల లోపు ఫిక్స్ డిపాజిట్ లపై వడ్డీ రేటులను పెంచుతూ ఒక సంవత్సరంలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్ డిపాజిట్ ల పై 6.20 శాతం వడ్డీని అందిస్తుండగా సీనియర్ సిటిజెన్ల కోసం 6.60% వడ్డీ రేటును ఇస్తున్నట్లు నిర్ణయించింది. ఇక సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: