మనీ: ఎల్ఐసి నుంచి అదిరిపోయే స్కీం.. ఏకంగా రూ.20 లక్షల లాభం..!!

Divya
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు ఎన్నోరకాల పాలసీలను అందిస్తూ వారికి లాభాన్ని చేకూరుస్తోంది. ఇకపోతే చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు ఎన్నో పాలసీలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి అవసరమైన పాలసీలను మీరు ఎంచుకునే అవకాశం కూడా కల్పించబడింది. చాలామందికి ఏ పాలసీ తీసుకోవాలో పెద్దగా తెలిసి ఉండదు. కాబట్టి పిల్లల పేరుపైన పాలసీ తీసుకోవాలని భావిస్తే.. చక్కటి గొప్ప పాలసీని మీ కోసం తీసుకురావడం జరిగింది. దీని ద్వారా పలు రకాల ప్రయోజనాలను కూడా పొందే అవకాశం ఉంటుంది. ఇక దీని పేరే ఎల్ఐసి జీవన్ తరుణ్ పాలసీ. ఇందులో పెట్టుబడి పెట్టడం వల్ల సుమారుగా కొన్ని లక్షల రూపాయలను మీరు లాభంగా పొందవచ్చు.
ఇక ఈ పాలసీ నాన్ లింక్డ్ పాలసీ.. ఇండివిడ్యువల్.. పార్టిసిపేటింగ్.. లైఫ్ ఇన్సూరెన్స్ సేవింగ్స్ ప్లాన్ కావడం గమనార్హం . ఇందులో పిల్లలు బీమా, రక్షణ పొదుపు ఇలా రెండింటి ప్రయోజనాలను కూడా పొందవచ్చు. పాలసీలో డబ్బులు పెట్టడానికి పిల్లలకు కనీస వయస్సు మూడు నెలలు ఉండాలి. ఇక మూడు నెలల నుండి 12 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లల పేరు పైన పాలసీ తీసుకుంటే మంచి లాభాలు వస్తాయి. ఇకపోతే పిల్లలకు మూడు నెలల నుంచి 20 సంవత్సరాల వరకు పాలసీ తీసుకుంటే ప్రతిరోజు 100 రూపాయల చొప్పున పిల్లల పేరు మీద ఇన్వెస్ట్ చేయాలి. ఇలా చేస్తే సుమారుగా రూ. 20 లక్షల వరకు ఫండ్ ను మీరు క్రియేట్ చేయవచ్చు.
ఒకవేళ మీ పిల్లల వయసు 10 సంవత్సరాలు అనుకుంటే.. అప్పుడు పాలసీ టర్మ్ కూడా 15 సంవత్సరాలు గా మారుతుంది. ఒకవేళ పిల్లలు వయస్సు 12 సంవత్సరాలు అంటే పాలసీ టర్మ్ 13 సంవత్సరాలు గా మారుతుంది. మీరు మూడు నెలలు లేదా ఆరునెలలు లేదా సంవత్సరానికి ఒకసారి డబ్బులు కట్టవచ్చు. ఇకపోతే ప్రతి సంవత్సరం మీరు 20 వ సంవత్సరం నుంచి 25 ఏళ్లు వచ్చే వరకు మనీ బ్యాక్ ఆప్షన్ కింద డబ్బులు తీసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: