మనీ: ఈ స్టాక్ తో కోట్లు పొందుతున్న ఇన్వెస్టర్స్..ఏకంగా రూ.20 కోట్లకు పైగా..!!

Divya
ప్రస్తుతం డబ్బు సంపాదించాలని ఆలోచిస్తున్న ప్రతి ఒక్కరు కూడా స్టాక్ మార్కెట్లో తమ డబ్బులు దాచుకోవడానికి ఆసక్తి చూపిస్తూ వుంటారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో స్టాక్ మార్కెట్ లో కొన్ని రకాల మల్టీ బ్యాగర్ లు కూడా ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఇకపోతే ప్రస్తుతం స్టాక్ మార్కెట్ పరిస్థితి బాగా లేనప్పటికీ కొన్ని రకాల మల్టీ బ్యాగర్స్ లో మాత్రం ప్రతికూల వాతావరణంలో కూడా అద్భుతమైన రాబడిని అందిస్తున్నాయి. దీర్ఘకాలికంగా భారీ స్థాయిలో రాబడి ఇచ్చిన ఒక స్టాక్ గురించి ఇప్పుడు మనం చదివి తెలుసుకుందాం. గత కొన్ని సంవత్సరాలలో 200000 శాతం కంటే ఎక్కువ రాబడిని స్పందించి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించింది.

ఇక ఆ కంపెనీ పేరు బాలకృష్ణ ఇండస్ట్రీస్ లిమిటెడ్.. ప్రస్తుతం ఇది టైర్లను తయారు చేస్తూ ఉంటుంది. ఈ కంపెనీకి మార్కెట్లో మంచి పేరు కూడా ఉంది. ఈ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసిన వారికి ప్రస్తుతం కోట్లల్లో కాసుల వర్షం కురుస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే గత కొన్ని సంవత్సరాల క్రితం ఈ షేరు ధర కేవలం ఒక రూపాయి మాత్రమే ఉండేది. కానీ దాని విలువ ఇప్పుడు రూ.2100 స్థాయి వరకు అభివృద్ధి చెందింది. ఇక ఈ కంపెనీ షేర్లు 52 వారాల గరిష్ట స్థాయి విలువ రూ.2724.40 వద్ద నమోదు కాగా 52 వారాల కనిష్ఠ స్థాయి విలువ.. రూ.1681.95 గా నమోదు అయ్యింది. 2002 జూన్ 7 నాటికి బాంబే స్టాక్ ఎక్సేంజ్ లో ఈ కంపెనీ షేరు విలువ రూ.1 వుండగా.. ఇక సుమారుగా 20 సంవత్సరాల కాలంలో అంటే 2022 జూన్ 24 నాటికి ఈ స్టాక్ ధర రూ.2131 వద్ద ముగిసింది. అంటే ఉదాహరణకు లక్ష రూపాయలు కనుక అప్పుడే పెట్టుబడిగా పెట్టి ఉంటే ప్రస్తుతం దాని విలువ రూ.21.31 కోట్లు అయ్యి వుండేది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: