మనీ: కొత్త ఇంటిని కొనేటప్పుడు ఈ విషయాలు తెలుసుకోవడం తప్పనిసరి..!!
ముఖ్యంగా మీ ఆర్థిక స్థితిపై మీకు అవగాహన ఉండాలి.. ఇక ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు మీ ఆర్థిక స్థితిని అలాగే పేమెంట్లు, ఈ ఎమ్ ఐ ల గురించి కూడా ఆలోచించుకోవాలి. ఇక మీకు ఎంత ఆదాయం వస్తోంది.. ఇంటికి ఎంత ఖర్చు అవుతోంది తదితర వివరాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈ ఎమ్ ఐ ఎంత ఉండాలనేది ప్లాన్ చేసుకోవాలి. ముందుగా ఎన్ని సంవత్సరాలు ఈఎంఐ చెల్లించాలి.. అప్పటి వరకు మనం ఖర్చులను ఎలా నియంత్రించాలి అనే విషయాలను అంచనా వేసుకున్న తర్వాతనే ఒక మంచి నిర్ణయం తీసుకోవడం తప్పనిసరి.
ఇక క్రెడిట్ స్కోర్ కూడా చెక్ చేసుకోవాలి. ముఖ్యంగా మీరు హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు మీ క్రెడిట్ స్కోర్ తప్పనిసరిగా 750 కంటే ఎక్కువ ఉండాలి. ఇక అప్పుడే మీకు లోన్ లభిస్తుంది. అంతే కాదు బ్యాంకు ను సంప్రదించే ముందు మీరు ఇప్పటికే ఏదైనా రుణాలు, ఈ ఎమ్ ఐ తీసుకొని ఉంటే వాటిని క్లియర్ చేసుకోవడం మంచిది. ఇక ఆ తర్వాత మీ ప్రాపర్టీ కి అవసరమైన ధృవీకరణ పత్రాలు, ఇంక్యుబేషన్ సర్టిఫికెట్, టైటిల్ డీడ్ వంటివి కచ్చితంగా ఉన్నప్పుడు మీరు తప్పకుండా హోమ్ లోన్ తీసుకొని సొంత ఇంటి కలను సాకారం చేసుకోవచ్చు.