Post Office : వీటిలో పెట్టుబడి పెడితే మీకు డబ్బులే డబ్బులు!

Purushottham Vinay
సురక్షితమైన విధానంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే పోస్టాఫీసు పథకాలు అనేవి చాలా అత్యుత్తమం. మీ డబ్బులు కొద్ది సంవత్సరాల్లో బాగా రెట్టింపయ్యే కొన్ని పథకాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.ఇక పోస్టాపీసు పథకాల్లో మీ డబ్బు ఎప్పుడూ క్షేమమే. అంటే మీరు నష్టపోరు. పోస్టాఫీసులో సేవింగ్స్ ప్లాన్స్ చాలా రకాలు ఉన్నాయి.ఇక ఇందులో డబ్బులు పెడితే..త్వరలోనే ఆ డబ్బు బాగా రెట్టింపవుతుంది. ఆ పథకాలను ఒకసారి పరిశీలిద్దాం..పోస్టాఫీసుకు సంబంధించిన నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్‌పై ప్రస్తుతం 6.8 శాతం వడ్డీ అనేది లభిస్తోంది. ఇక ఇది ఐదేళ్ల సేవింగ్ స్కీమ్. ఇందులో పెట్టుబడితో ఇన్‌కంటాక్స్ మినహాయింపు అనేది కూడా ఉంటుంది. ఈ వడ్డీను లెక్కేస్తే పదేళ్లలో మీ డబ్బు బాగా రెట్టింపు అవుతుంది. మరో పోస్టాఫీసు పథకం వచ్చేసి సుకన్య సమృద్ది యోజన. ఈ స్కీమ్‌పై ప్రస్తుతం 7.6 శాతం వడ్డీ అనేది లభిస్తుంది. అమ్మాయిల కోసం ఈ పథకంని ప్రారంభించారు. ఇందులో డబ్బులు డబుల్ అయ్యేందుకు దాదాపు 9.47 ఏళ్ల సమయం పడుతుంది. ఇక మరో పథకం వచ్చేసి పోస్టాఫీసు సీనియర్ సిటిడన్ స్కీమ్. అలాగే ఇందులో ప్రస్తుతం 7.4 శాతం వడ్డీ ఇస్తున్నారు. ఈ స్కీమ్ ప్రకారం మీ డబ్పులు రెట్టింపయ్యేందుకు 9.73 ఏళ్లు సమయం పడుతుంది.ఈ పోస్టాఫీసులో 15 ఏళ్ల పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్‌పై ప్రస్తుతం 7.1 శాతం వడ్డీ అనేది లభిస్తుంది. అంటే ఈ రేటుతో మీ డబ్బులు రెట్టింపయ్యేందుకు దాదాపు 10.14 ఏళ్లు సమయం పడుతుంది.


ఇక మరో పథకం వచ్చేసి పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కం స్కీమ్. ఇందులో ప్రస్తుతం లభిస్తున్న 6.6 వడ్డీ ప్రకారం మీ డబ్బులు రెట్టింపయ్యేందుకు దాదాపుగా 10.91 ఏళ్లు సమయం అనేది పడుతుంది. పోస్టాఫీసు సేవింగ్ బ్యాంక్ ఎక్కౌంట్‌లో మీరు కనుక డబ్బులు పెట్టుబడి పెడితే..మీ డబ్బులు రెట్టింపయ్యేందుకు దీర్ఘకాలం పాటు నిరీక్షించాలి. ఇందులో కేవలం 4 శాతం మాత్రమే వడ్డీ అనేది లభిస్తుంది. మీ డబ్బులు రెట్టింపయ్యేందుకు ఏకంగా 18 ఏళ్లు సమయం పట్టవచ్చు.అలాగే ఇక మరో ఆకర్షణీయమైన పోస్టాఫీసు పథకం పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ పథకం. ఇందులో 5.8 శాతం వడ్డీ అనేది లభిస్తుంది. ఈ లెక్కన మీ డబ్బులు రెట్టింపయ్యేందుకు 12.41 ఏళ్లు సమయం పట్టనుంది. పోస్టాఫీసులో ఏడాది నుంచి మూడేళ్ల వ్యవధికి టైమ్ డిపాజిట్ స్కీమ్ అనేది ఉంది. ఇందులో 5.5 శాతం వడ్డీ అనేది లభిస్తుంది. ఇందులో పెట్టుబడి పెడితే మీ డబ్బులు రెట్టింపయ్యేందుకు 13 ఏళ్లు సమయం పడుతుంది. అదే విధంగా ఐదేళ్లకు పెడితే 6.7 శాతం వడ్డీ అనేది లభిస్తుంది. ఈ లెక్కన మీ డబ్బులు రెట్టింపయ్యేందుకు 10.75 ఏళ్లు సమయం పట్టవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: