మనీ: కేవలం రూ.10 వేలు పెట్టుబడి పెడితే చాలు.. లక్షల్లో ఆదాయం..!!

Divya
తక్కువ ఖర్చు పెట్టాలి.. ఎక్కువ లాభం పొందాలి అని అనుకుంటూ ఉంటారు ముఖ్యంగా మీరు కూడా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందాలని ఆలోచిస్తున్నారా..? అయితే మీలాంటి వారికోసమే ఒక చక్కటి బిజినెస్ ఐడియా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్ర , తెలంగాణ వంటి రాష్ట్రాలలో ఎక్కువగా తయారు చేసే ఈ వ్యాపారం ప్రస్తుతం దేశం నలుమూలల విస్తరిస్తోంది అని చెప్పడంలో సందేహం లేదు. అదే బింది తయారీ వ్యాపారం. ఇక్కడ ఒక చిన్న యంత్రం సహాయంతో మీరు బిందీ లను తయారు చేసే వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.
ఇక దీనికి ఒక కార్యాలయం లేదా ఫ్యాక్టరీని ఏర్పాటు చేయవలసిన అవసరం ఏమీ లేదు.  మీ ఇంట్లోనే ఒక మూల నుంచి ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టవచ్చు. అయితే స్త్రీల యొక్క 16 అలంకరణలలో బిందీ కూడా  ఒకటి అన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే గత కొన్ని సంవత్సరాల నుంచి గుండ్రటి బిందీ లకు మంచి గిరాకీ కూడా ఉంది. ఇకపోతే ఈ ఏడాది పొడవునా ఉండే ఈ బిజినెస్ వల్ల ఎటువంటి నష్టం రాదు. ముఖ్యంగా ఈ బిందీ ఎక్కువగా నగరాలలో,  పల్లెలో ఉన్న మహిళలు ఉపయోగిస్తారు. ఒక మహిళా సంవత్సరానికి 20 ప్యాకెట్లు బొట్టు బిల్లలను వాడుతుంది. అయితే దీనికి కేవలం పది వేల రూపాయల పెట్టుబడితో బిందీ తయారీ వ్యాపారాన్ని మీరు ప్రారంభించవచ్చు.
ఇక మీరు దీన్ని తయారు చేయడానికి వెల్వెట్ క్లాత్, జిగురు పదార్థం అవసరం . అంతేకాకుండా అలంకరణ సామాగ్రి లో స్పటికాలు, రాళ్లు, ముత్యాలు అవసరమవుతాయి. ఇక ప్యాకింగ్ వస్తువులను మీరు సులభంగా కొనుగోలు చేయవచ్చు. నాణ్యమైన బిందీ చేస్తే.. అవసరమయ్యే బ్యూటీ పార్లర్ లలో మంచి డిమాండ్ వుంది. దుకాణాలు సూపర్ మార్కెట్లలో ఆలయం చుట్టూ ఉన్న దుకాణాలు కూడా మీరు వీటిని సరఫరా చేయవచ్చు. బొట్టు బిల్లలు మార్కెట్ చేయడం నేర్చుకుంటే ఆన్లైన్ లో కూడా మీరు అమ్మవచ్చు. ఇక ఎంతలేదన్నా సుమారుగా సంవత్సరానికి లక్షల రూపాయలు లాభం పొందుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: