మనీ: పిల్లల పేరు పై రూ.10 వేల పెట్టుబడితో.. రూ.32 లక్షలు లాభం..!!

Divya
పిల్లల జీవితం బాగుండాలని ప్రతి ఒక్కరు కూడా ఎన్నో కలలు కంటూ ఉంటారు. ఇక తల్లిదండ్రులు వారి యొక్క చదువుల కోసం,  వివాహానికి ఖర్చుల కోసం ముందుగానే ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడున్న పరిస్థితులలో ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతో తమ పిల్లలు జీవితాన్ని మెరుగుపరచడానికి కొన్ని సరైన సమయంలో పెట్టుబడి పెట్టి వాటిని ప్రణాళిక రూపొందిస్తూ ఉంటారు. ఇందుకోసం తక్కువ డబ్బు పెట్టుబడి గా పెట్టడం ద్వారా దీర్ఘకాలికంగా  అధిక మొత్తంలో డబ్బులను అందుకునే పథకాలు చాలానే ఉన్నాయి.. అందులో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్,  ppf స్కీం కూడా ఒకటి. మీరు సరైన సమయంలో మీ పిల్లల కోసం ఈ ఖాతా ను  తెరిచి కొంత డిపాజిట్ చేయడం వల్ల ప్రతి నెల పెద్దయ్యాక పెద్ద మొత్తంలో డబ్బు అందుకోవచ్చు.
ppf  లో చేరేందుకు వయసు పరిమితి ఏమీ లేదు. మీకు కావలసినప్పుడు మీ ఖాతాను తెరిచి పెట్టుబడిగా పెట్టుకోవచ్చు. ఇందుకోసం మీరు కేవలం బ్యాంకు కు వెళ్లి మీ పని పూర్తి చేసుకోవచ్చు. అయితే ppf  ఖాతా ను ఎలా తెరవాలి ఇప్పుడు తెలుసుకుందాం.
ఖాతాను తెరవడానికి ముందుగా మీకి చెల్లుబాటు అయ్యే పాస్ పోర్ట్, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి చిరునామాగా ఉంచాలి. మీరు మీ పిల్లల జనన ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. పాస్ పోర్ట్ సైజు గల ఫోటోలను తీసుకోవాలి. మీరు ఈ ఖాతాలను తెరిచే సమయంలో రూ.500 లేదా అంతకంటే ఎక్కువ ను ఎక్కువగా అందించవలసి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే మీ పిల్లల నేమ్ మీద పాస్ బుక్ జారీ చేయబడుతుంది.
ఈ బుక్ ఖాతా మీద రూ.32 లక్షల ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం పిల్లల వయసు మూడు సంవత్సరాల సమయం ఉన్నట్లయితే..ppf ఖాతా తెరిచి నట్లయితే 18 ఏళ్ళు వచ్చేసరికి.. 15 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడుతూనే ఉండాలి. ప్రతి నెల రూ.10 వేలు జమ చేసినట్లు అయితే పదిహేను సంవత్సరాల పాటు ఇలా చేస్తూనే ఉండాలి. ఇక ఈ డిపాజిట్ మొత్తానికి 7.10 శాతం వడ్డీ లభిస్తుంది .. దీంతో మీ పిల్లలను మెచ్యూరిటీ సమయానికి రూ.3,216,241 వరకు లభిస్తుంది పిల్లల వయస్సు 18 సంవత్సరాల తర్వాత ఈ మొత్తాన్ని అందుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: