మనీ: రైతులకు శుభవార్త.. వారి ఖాతాలో రూ.2 వేలు జమ..!

Divya
రైతులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న నిరీక్షణ నేటితో ముగిసింది. ఈవారమే ప్రభుత్వం రైతుల ఖాతాల్లో ఏకంగా రెండు వేల రూపాయలు జమ చేయడానికి ప్రయత్నాలు సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించిన సన్నాహాలు కూడా పూర్తి చేసినట్లు మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రైతు భాగస్వామ్యం - ప్రాధాన్యత హమారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీని కింద పెద్ద సంఖ్యలో రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు ని కూడా ఇవ్వడం గమనార్హం. రైతుల ఖాతాల్లోకి 11 వ విడత డబ్బులు కూడా జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల పనులను సమకూర్చింది.

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద సంవత్సరానికి ఒక రైతు ఖాతాలో ఆరు వేల రూపాయలను 3 విడుతల గా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ పథకం కింద ఇప్పటి వరకు సుమారుగా రూ. 11 కోట్ల మంది రైతులు డేటా వెరిఫై అయ్యింది అని వ్యవసాయ శాఖ అధికారి వెల్లడించారు. అంతేకాదు ఈ సందర్భంగా ఈ కేవైసీ  చేయించుకోవాలని కూడా రైతులకు సూచించడం జరిగింది. ఇక పోతే ఈ పథకం కింద సుమారు 22వేల కోట్ల రూపాయలు ఒకేసారి విడుదల కాబోతున్నాయి. కాబట్టి మీరు కూడా మీ యొక్క స్టేటస్ లను పూర్తిగా చెక్ చేస్తూ ఉండండి.

ఇక ఎలా చెక్ చేసుకోవాలి అనే విషయానికి వస్తే.. ముందుగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం యొక్క వెబ్‌సైట్‌పై క్లిక్ చేయండి.
 ఇందులో కుడివైపున ‘ఫార్మర్స్ కార్నర్’ కనిపిస్తోంది. ఇందులో బెనిఫిషియరీ స్టేటస్‌పై మీరు క్లిక్ చేయండి.
ఇందులో ఆధార్ నంబర్‌ ఎంటర్ చేయడం ద్వారా మీ స్టేటస్‌ యొక్క తనిఖీ చేయవచ్చు. ఏదైనా సమస్య ఉన్నా మీకు తెలుస్తుంది.
ఇక ఈ పథకానికి సంబంధించి మీకు ఏదైనా సమస్య ఉంటే మీరు నేరుగా కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖను వెంటనే  సంప్రదించవచ్చు. PM కిసాన్ హెల్ప్‌లైన్ నంబర్ 155261 మరియు 011-24300606. కాల్‌ కూడా చేయవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: