తమ కస్టమర్లకు గైడ్ లైన్స్ విడుదల చేసిన SBI..!!

Divya
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ లకు హైఅలర్ట్ విధించింది. ఇటీవల క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, యూపీఐ, ఎటిఎం వంటి మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో ఎస్బిఐ డిజిటల్ సెక్యూరిటీ గైడ్ లైన్స్ విడుదల చేయడం జరిగింది. ఆన్లైన్ బ్యాంకింగ్ యూపీఐ పేమెంట్స్, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎం ట్రాన్సక్షన్ వంటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ఎలాంటి పనులు చేయకూడదు..? ఎలాంటి పనులు చేయాలి..? లావాదేవీల విషయంలో ఎలా అప్రమత్తంగా ఉండాలి..? ఇలా అన్ని వివరాలను కూడా ఎస్బిఐ తాజాగా వివరించింది. ఎస్బిఐ విడుదల చేసిన డిజిటల్ సెక్యూరిటీ తమ ఖాతాదారులకు మాత్రమే కాదు.. ఇతర బ్యాంకులు అకౌంట్స్ ఉన్న వారికి కూడా ఈ గైడ్లైన్స్ ఉపయోగపడతాయి.. మరి ఆ గైడ్లైన్స్ ఏమిటో ఇప్పుడు ఒకసారి మీరు కూడా చదివి తెలుసుకోండి.
లాగిన్ సెక్యూరిటీ తప్పనిసరిగా ఉండాలి.. మీరు ఆన్లైన్ బ్యాంకింగ్ చేస్తూ ఉన్నట్లయితే కష్టతరమైన పాస్వర్డ్లు మాత్రమే ఉపయోగించాలి. ప్రతి నెలకు ఒకసారి పాస్వర్డ్ మారుస్తూ ఉండటం తప్పనిసరి. మీ యూజర్ ఐడి, పిన్,  పాస్వర్డ్ ఎక్కడ ఎప్పుడు రాసి పెట్టుకోవద్దు. ఎవరికి కూడా షేర్ చేయకూడదు. మీకు సన్నిహితులైన సరే .. మీ కుటుంబ సభ్యులు అయినా సరే ఎవరికి కూడా చెప్పకూడదు. లాగిన్ చేసేటప్పుడు రిమెంబర్ ఆప్షన్,  ఆటో సేవ్ అలాంటి ఆప్షన్ లను వాడవద్దు.
ఇక నెట్ బ్యాంకింగ్ చేసేటప్పుడు కూడా బ్యాంకు వెబ్ సైట్ లో ముందుగా హెచ్ టి టి పి ఎస్ అని ఉందో లేదో చూడాలి. హెచ్ టి టి పి ఎస్ ఉంటేనే అది బ్యాంకు అధికారిక వెబ్సైట్ గా మనం భావించాలి. పబ్లిక్ వైఫై ఉపయోగించి బ్యాంకు లావాదేవీలు ఎప్పుడూ కూడా మీరు చేయవద్దు ఒకవేళ చేస్తే మీ డబ్బులు హ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది. లావాదేవీలు పూర్తయిన వెంటనే లాగ్ అవుట్ చేయడం కూడా మరిచి పోవద్దు ఇలాంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: