మనీ: హోమ్ లోన్ పొందే వారికి శుభవార్త.. తక్కువ వడ్డీకి లోన్ అందిస్తున్న బ్యాంక్..!!

Divya
దేశాంతరం పోయినా స్వతంత్రం ఉండాలి అని మన పెద్దవాళ్ళు ఊరికే అనలేదు. అందుకే ప్రతి ఒక్కరు కూడా సొంత ఇంటిని నిర్మించుకోవాలని కలలుకంటూ.. అందులో భాగంగానే ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక సొంత ఇంటి నిర్మాణం కోసం ముందు నుంచే డబ్బులు పోగు చేయడం లేదా అప్పుతెచ్చి అయినా సరే ఇంటిని నిర్మించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎవరైతే రుణాలు పొందాలని బ్యాంకులను ఆశ్రయిస్తున్నారో అలాంటి వారికి ఒక చక్కటి శుభవార్త అని చెప్పవచ్చు. ముఖ్యంగా భారత ప్రభుత్వానికి చెందినటువంటి బ్యాంక్ ఆఫ్ బరోడా తాజాగా అదిరిపోయే శుభవార్తను కస్టమర్లకు తీసుకు రావడం జరిగింది. అంతేకాదు అతి తక్కువ వడ్డీ రేట్లకు హోమ్ లోన్ ఆఫర్ను ప్రకటించడం గమనార్హం.

సొంతింటి కలను నెరవేర్చుకోవాలని అనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా సామాన్యులను దృష్టిలో పెట్టుకొని కేవలం 6.50 శాతం వడ్డీతో ఇంటి రుణాలను ఇవ్వడానికి సిద్ధమైంది. అంతేకాదు ఇండస్ట్రీలో అతి తక్కువ వడ్డీ రేట్లను అందిస్తున్న బ్యాంకుల జాబితాలో బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా చోటు సంపాదించుకోవడం గమనార్హం. అంతేకాదు హోమ్ లోన్ అప్లై చేయడానికి ముందు కట్టాల్సిన ప్రాసెసింగ్ ఫీజును కూడా పూర్తిగా తొలగించింది. గత ఏడాది 6.75% వార్షిక వడ్డీ రేటు తో ఇంటి రుణాలను అందించిన బ్యాంక్ ఆఫ్ బరోడా తాజాగా శాతం తగ్గించి 6.50 శాతం వడ్డీతో రుణాలు అందిస్తామని ప్రకటించింది.
ఇకపోతే బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటించిన హోమ్ లోన్ ఆఫర్లు కేవలం కొద్ది రోజులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా 2022 జూన్ 30 లోగా ఇంటి రుణాలు పొందాలని  ఆలోచించేవారికి 6.5 శాతం వడ్డీరేటు తో లభిస్తోంది. ఇక ప్రాసెసింగ్ ఫీజు కూడా పూర్తిగా మినహాయింపు లభించింది కాబట్టి బ్యాంక్ ఆఫ్ బరోడా లో తక్కువ వడ్డీకే హోమ్ లోన్ పొందవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: