మనీ: ఈ పథకంలో రూ.7 పొదుపు తో రూ.60 వేలు పెన్షన్..!!

Divya
ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా..ఏ పని జరగాలన్నా డబ్బుతో ముడిపడి ఉంటుంది. అందుకే చాలామంది వృద్ధాప్య ఖర్చుల గురించి ఇప్పటి నుంచి ఆందోళన చెందుతున్నారు. ఇక మీరు కూడా వృద్ధాప్యంలో ఆర్థిక ఇబ్బందుల గురించి ఆందోళన చెందుతున్నట్లు అయితే తప్పకుండా ఇప్పుడు చెప్పబోయే ఒక సమాచారం గురించి తెలుసుకోవాల్సిందే. అదేమిటంటే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అటల్ పెన్షన్ యోజన పథకం ద్వారా వృద్ధాప్యంలో ఎటువంటి ఆందోళనలు చెందకుండా హాయిగా జీవించవచ్చు. 2015 వ సంవత్సరంలో ప్రారంభించిన ఈ పథకం ద్వారా అసంఘటిత రంగాల్లో పని చేసే వ్యక్తుల కోసం ఈ పథకాన్ని మోడీ ప్రభుత్వం ప్రవేశ పెట్టడం జరిగింది.

ఇక భారతీయ పౌరులు ఎవరైనా సరే 18 నుంచి 40 సంవత్సరాల వయసు లోపు ఉన్న వారు ఈ పథకంలో చేరడానికి అర్హులవుతారు. ఇక ఇందులో డిపాజిట్ చేసేవారు 60 సంవత్సరాల తర్వాత ప్రతి నెల పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. ఈ పథకం కింద మీరు ప్రతి నెలా కనిష్టంగా 1000 రూపాయల నుంచి గరిష్టంగా 5000 రూపాయల వరకు పెన్షన్ పొందే అవకాశాలను మోడీ ప్రభుత్వం కల్పించడం జరిగింది. ఇక మీరు కూడా ఈ పథకం యొక్క ప్రయోజనాలను పొందాలనుకుంటే సేవింగ్స్ ఖాతా నెంబరు, అలాగే ఆధార్ కార్డు నెంబరు వీటికి లింకు అయిన  మొబైల్ నెంబర్ ను కూడా సమర్పించాల్సి ఉంటుంది.
ఇక ఈ పథకంలో ఎంత త్వరగా పెట్టుబడి పెడితే అంత ఎక్కువ ప్రయోజనాన్ని కూడా వ్యక్తులు పొందవచ్చు. 18 సంవత్సరాల వయసులో అటల్ పెన్షన్ పథకం లో చేరి నట్లయితే 60 సంవత్సరాల తర్వాత నెలకు ఐదు వేల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. ఇక ఇందుకోసం ఆ వ్యక్తి నెలకు 210 రూపాయలు అంటే రోజుకు 7 రూపాయలు చొప్పున డిపాజిట్ చేయడం వల్ల సంవత్సరానికి 60 వేల రూపాయలను పెన్షన్ కింద పొందవచ్చు. ఇక నెలవారీ 42 రూపాయలు డిపాజిట్ చేస్తే వెయ్యి రూపాయల పెన్షన్,  84 రూపాయలు డిపాజిట్ చేస్తే రూ.2 వేల పెన్షన్ ,126 రూపాయలు డిపాజిట్ చేస్తే రూ.3 వేలు.. 168 రూపాయలు డిపాజిట్ చేస్తే  రూ.4000 కూడా  పెన్షన్ కింద నెలకు పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: