మనీ: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు శుభవార్త..!

Divya
అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల సంకేతాలు కారణంగా స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి . ఎఫ్ఐఐల కొనుగోలు తిరిగి ప్రారంభం కావడంతో మార్కెట్లకు కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది. ఇకపోతే గతనెల జీఎస్టీ వసూలు.. రికార్డు స్థాయిలో నమోదు కావడం కూడా మదుపర్ల లో ఉత్సాహం నింపే అంశం అని చెప్పవచ్చు. వీటితో పాటు రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధ పరిణామాలు .. చమురు ధరలు పెరగడం కీలకంగా మారాయి. ఇకపోతే ఈ నెల 6 నుండి 8 తేదీల మధ్య జరిగే ఆర్బిఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలపై కూడా దృష్టి సారించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇన్ని పరిణామాల మధ్య ఉదయం 09:55 గంటల సమయంలో సెన్సెక్స్ 1197 పాయింట్ల లాభంతో 60, 474 వద్ద వుండగా.. నిఫ్టీ 322 పాయింట్ల వద్ద లాభపడి 17,993 వద్ద ట్రేడ్ కొనసాగుతోంది.

ఇక ఫలితంగా డాలర్ తో రూపాయి మారకం విలువ కూడా 75.78 వద్ద కొనసాగుతూ ఉండడం గమనార్హం. సెన్సెక్స్ 30 సూచీలో M&M,  ఇన్ఫోసిస్,  పవర్గ్రిడ్, మారుతి , బజాజ్ ఫిన్ సర్వ్,  ఐటిసి షేర్ లు మాత్రమే నష్టాలతో కొనసాగుతున్నాయి.. ఇక హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి,  టెక్ మహేంద్ర , ఎస్బిఐ,  టైటాన్,  హెచ్సీఎల్ టెక్ , ఐసిఐసిఐ బ్యాంకు షేర్లు లాభాలతో పయనిస్తూ ఉండటం గమనార్హం. ఇకపోతే రుణదాత హౌసింగ్ డెవలప్ మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏప్రిల్ 4వ తేదీన తన పూర్తి యాజమాన్య అనుబంధ సంస్థలు అయినటువంటి హెచ్డిఎఫ్సి హోల్డింగ్స్ లిమిటెడ్ అలాగే హెచ్డిఎఫ్సి ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్.. హెచ్డిఎఫ్సి బ్యాంక్ లిమిటెడ్ తో విలీనం చేయడానికి ఆమోదించినట్లు గా సమాచారం.
హెచ్డిఎఫ్సి బ్యాంకు షేర్లు 7.50 శాతం పెరిగి రూ.1619.20 వద్ద మార్కెట్ విలువ రూ. 8,97,933.99 కోట్లుగా చెరువులో కొనసాగుతోంది. మరొకవైపు హెచ్డీఎఫ్సి 9.27 శాతం పెరిగి రూ.2,678.20 కి చేరుకోగా మార్కెట్ విలువ రూ. 4,85,564.27 కోట్లకు చేరుకోవడంతో ఇన్వెస్టర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు అంతే కాదు వీటిలో ఇన్వెస్ట్ చేసిన వారికి కాసుల వర్షం కురుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: