మనీ : కొత్త ఆర్థిక సంవత్సరం.. మారనుంది సామాన్యుడికి శాపం..!!

Divya
పెరగనున్న ధరలతో సామాన్యుడికి చుక్కలు కనిపించబోతున్నాయని ప్రతి ఒక్కరు ఆందోళన చెందుతున్నారు. 2022 - 2023 కొత్త ఆర్థిక సంవత్సరానికి గాను ఈరోజు నుంచి ఎన్నో మార్పులు చోటు చేసుకోనున్నాయి. సాధారణంగా ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి మొదలవుతుంది కాబట్టి పి ఎఫ్ ఖాతాలపై చెల్లించే పన్ను నుంచి మ్యూచువల్ ఫండ్స్ అలాగే డిజిటల్ చెల్లింపుల వరకు ధరలు పెరగనున్నాయి. ఇక ఈ రోజు నుంచి అనేక మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో సామాన్యుడు మరింత బలి కావాల్సి వస్తుందని చెప్పవచ్చు. కొత్త సంవత్సరం ప్రజలపై ఆర్థిక భారం అధికంగా పడబోతోంది అని ఈరోజు అమలులోకి వచ్చిన కొన్ని అంశాలు తెలియజేస్తున్నాయి. ఈ అంశాల ద్వారా ప్రజలు ప్రభావితం అవుతారు.

1. పిఎఫ్ పన్ను విధించబడుతుంది:
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ నోటిఫికేషన్ తెలిపిన వివరాల మేరకు రూ. 2.5 లక్షల కంటే ఎక్కువ ఉన్న ఉద్యోగి యొక్క PF సహకారంపై వడ్డీ ఏప్రిల్ 1, 2022 నుండి అధికంగా పన్ను విధించబడుతుంది.
2. ఖరీదైన ఇంటిని కొనుగోలు చేయడం:
నిన్నటి వరకు కొత్త ఇంటిని కొనుగోలు చేస్తే మొదటి ఇంటికి పన్ను మినహాయింపు లభిస్తుంది . కానీ నేటి నుంచి అందులో మార్పులు చోటుచేసుకున్నాయి . ఇకపై ఎవరైనా సరే ఖరీదైన ఇంటిని మొదటిసారి కొనుగోలు చేసినా సరే పన్ను కట్టాల్సి ఉంటుంది.80EEA సెక్షన్ కింద కేంద్ర ప్రభుత్వం మొదటి సారి ఇల్లు కొనుగోలు చేసేవారికి పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని నిలిపివేసినందు వల్ల ఇల్లు కొనడం ఖరీదైనది.  
3. 800కు పైగా మందుల ధరలలో మార్పు:
పెయిన్ కిల్లర్స్,యాంటీ వైరస్,  యాంటీబయాటిక్స్ తో  సహా 800కి పైగా మందుల ధరలు ఏప్రిల్ 1 నుంచి 10 శాతానికి పైగా పెరగనున్నాయి.
4.క్రిప్టోకరెన్సీపై అధికంగా పన్ను:
ఈ రోజు నుంచి లాభాల కోసం విక్రయించే క్రిప్టోకరెన్సీ తో పాటు NFT అల్అన్ని రకాల వర్చువల్ డిజిటల్ ఆస్తుల పై 30 శాతం పన్ను విధించబడుతుంది. ఇది కాకుండా, క్రిప్టో ఆస్తిని విక్రయించినప్పుడల్లా 1% TDS కూడా తీసివేయబడుతుంది అని గుర్తించుకోవాలి.
5. వాహన కొనుగోళ్లపై ధరలు పెరగనున్నాయి:
ఈ రోజు నుంచి ఫోర్ వీలర్ వెహికల్స్ కొనాలనుకున్న వారికి కూడా షాకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. దారులు కూడా తమ వాహనాలపై ధరలు పెంచనున్నారు.
6.యాక్సిస్ బ్యాంక్ మినిమమ్ బ్యాలెన్స్ పరిమితిని కూడా పెంచింది:
యాక్సిస్ బ్యాంక్ సేవింగ్స్ ఖాతాల నెలవారీ బ్యాలెన్స్ పరిమితిని రూ.10,000 నుంచి రూ.12,000 కి పెంచడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: