మనీ: రైతులకు జగనన్న కానుక..!!

Divya
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతుల పక్షపాతి అని నిరూపించుకోవడానికి మరో మంచి పని మొదలు పెట్టినట్లు సమాచారం.. అయితే ఆయన గత ఏడాది రైతు దినోత్సవం సందర్భంగా పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ఎంతో మంది రైతులకు సరికొత్త పథకాలను అమలు చేసి వారి కళ్ళల్లో ఆనందాన్ని చూశాడు. సుమారుగా గత ఏడాది రూ.250 కోట్ల బడ్జెట్ తో మొదలుపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయడానికి అధికారులు శరవేగంగా పనిచేస్తున్నారు. ఇక పలు వ్యవసాయ మార్కెట్ కు సంబంధించిన భవనాలు.. మార్కెట్ యార్డులు.. గోడౌమ్స్ నిర్మాణాల పనులు వేగంగా జరుగుతున్నాయి

నాడు నేడు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి మంచి ఫలితాన్ని ఇస్తుందని రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా నాడు నేడు కార్యక్రమాన్ని పాఠశాలలో నిర్వహించి.. మంచి ఫలితాన్ని సొంతం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మార్కెటింగ్ రంగంలో కూడా విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది. రైతు యొక్క మార్కెట్ పరిధిని పెంచడం కోసం ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది అని ఇక భవిష్యత్తులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ పంటను అమ్ముకోవడానికి తగిన ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం . ఇక జగన్ మోహన్ రెడ్డి కూడా రైతుల కోసం ఎప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఇక ఆ హామీ మేరకే రాష్ట్రంలోని పలు మార్కెట్ యాడ్ ల నవీకరణ చేయడం కోసం అధికారులు అలాగే  రైతులు సమన్వయంతో మార్కెట్ యార్డ్ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు గా జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. మార్కెట్ యార్డ్ లో తమ పంటలు పారదర్శకంగా అమ్ముకునే విధంగా కల్పించామని ఆయన ప్రకటించడం జరిగింది. గత ప్రభుత్వం హయాంలో రైతులు తమ పంటలను అమ్ముకోలేక మార్కెట్ యార్డ్ లో ఎన్నో ఇబ్బందులు పడ్డారు అని.. ఇక భవిష్యత్తులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు. ఏది ఏమైనా నాడు నేడు కార్యక్రమం లో మార్కెటింగ్ రంగాన్ని అనూహ్యంగా మారుస్తున్న అందుకు రైతులు కూడా జగన్మోహన్ రెడ్డి పై ఆనందం వ్యక్తం చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: