మనీ: మందు బాబులకు శుభవార్త తెలిపిన తెలంగాణ సర్కార్..!!

Divya
మందుబాబులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.. అదేమిటంటే త్వరలోనే లిక్కర్ ధరలు తగ్గించడానికి ప్రభుత్వం సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా మద్యం ధరలు బాగా పెరిగిపోవడంతో మద్యం సేవించే వారు కూడా తగ్గి పోతున్నారు అని ఫలితంగా లిక్కర్ ధరలు తగ్గించి సేల్స్ ను పెంచే దిశగా ఆప్కారీ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం.. ఇకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపితే కొత్త రేట్లు వచ్చే నెల ఒకటో తారీకు నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది..
ముఖ్యంగా బీరు మినహాయించి ఇండియాలో తయారయ్యే లిక్కర్ బాటిళ్ల పై స్వల్పంగా ధరలు తగ్గించనున్నారు. ధరలు తగ్గిస్తే ఖచ్చితంగా సేల్స్ పెరిగి లాభాలు పెరిగే.. ఎక్కువగా సేల్స్ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అని ఆప్కారి శాఖ భావిస్తోంది. ఇకపోతే లాభాలను పెంచే దిశగా ఈ ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.. మొత్తంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో 2620 వైన్ షాపు లతోపాటు వెయ్యికి పైగా బార్లు టూరిజం హోటల్ క్లబ్బులు ఉన్నాయి. వీటికి మద్యం డిపోల నుంచి సరుకు రవాణా అవుతుంది కాబట్టి  ధరలు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు.
కరోనా మహమ్మారి కారణంగా పరిస్థితుల రీత్యా పోయిన సంవత్సరం 20 శాతం వరకు లిక్కర్ రేటు ను పెంచింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అయితే అన్ని రాష్ట్రాలలో రేట్లు పెంచి ఆ తర్వాత తగ్గించారు. కానీ  తెలంగాణ ప్రభుత్వం వారు మాత్రం తగ్గించలేదు. అయితే ఇటీవల బీర్ సేల్స్ చాలా వరకు తగ్గిపోవడంతో ఒక్కో బాటిల్ మీద పది రూపాయలను తగ్గించింది రాష్ట్ర ప్రభుత్వం. కానీ లిక్కర్ బాటిల్పై ధరలు తగ్గించలేదు అందుకే వీటి అమ్మకాలను మరింత పెంచేందుకు బాటిల్ పై మరో పది రూపాయలు తగ్గించడానికి అధికారులు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు తెలంగాణ శాఖ నుంచి సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: