మనీ: పోస్ట్ ఆఫీస్ కస్టమర్లకు అలర్ట్..!!

Divya
పోస్ట్ ఆఫీస్ లో మనకు ఎన్నో రకాల పథకాలు ఉన్నాయి. కాబట్టి ఈ పథకాల ద్వారా డబ్బులు పొందాలంటే మీరు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ పోస్ట్ ఆఫీస్ మనకు కూడా ఏప్రిల్ నెల ను డెడ్ లైన్ గా విధించడం జరిగింది. ఆ లోపు మీరు గనుక కొన్ని పనులు చేయక పోతే ఇక మీరు మీ పథకం లో పెట్టిన డబ్బులు రావు అని పోస్ట్ ఆఫీస్ తమ ఖాతాదారులకు హెచ్చరించడం జరిగింది. ముఖ్యంగా పోస్ట్ ఆఫీస్ ప్రవేశపెట్టిన పథకాలను మంత్లీ ఇన్కమ్ స్కీం.. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్.. పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్ వంటి వాటిల్లో మీరు డబ్బులు పెట్టినట్లయితే తప్పకుండా కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి..

ఇక మీరు కూడా ఈ పథకాలలో చేరి ఉంటే పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంక్ అకౌంట్ ను ఈ పథకాలకు అనుసంధానం తప్పకుండా చేసుకోవాలి. ఈ మూడు పథకాలలో డబ్బులు ఇన్వెస్ట్ చేసిన వారు నెల ,మూడు నెలలు, సంవత్సరం పొడవునా డబ్బులు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మీకు నచ్చిన ఆప్షన్ ఎంచుకునే వీలు కల్పించబడింది. ఇప్పటికీ ఈ స్కీం లలో చేరిన కొంతమంది వారి పోస్ట్ ఆఫీస్ అకౌంట్.. బ్యాంక్ అకౌంట్ తో అనుసంధానం చేసుకోలేదని గుర్తించిన పోస్టల్ శాఖ.. తమ కస్టమర్లను అలర్ట్ చేయడం జరిగింది..

వచ్చే నెల అనగా ఏప్రిల్ నెల నుంచి సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్.. మంత్లీ ఇన్కమ్ స్కీం..పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్లపై ఆర్జించిన వడ్డీ మొత్తాన్ని.. ఇన్వెస్టర్లు ఈ పథకం తో లింక్ చేసుకున్న పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ లేదా బ్యాంక్ అకౌంట్ లలో వడ్డీని జమ చేస్తామని వెల్లడించింది. ఇకపోతే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి సండ్రీ అకౌంట్ ద్వారా క్యాష్ రూపంలో చెల్లింపులు ఉండవని డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్ స్పష్టంచేసింది.. సేవింగ్స్ అకౌంట్ లో జమ అయిన వడ్డీ డబ్బులకు మీరు మళ్లీ అదనంగా వడ్డీ పొందవచ్చు. ఒకవేళ నేరుగా ఈ పథకాలలో చేరిన వారు డబ్బులు విత్ డ్రా చేసుకుంటే ఎలాంటి వడ్డీలు రావని పోస్టల్ శాఖ స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: